Rajinikanth: ‘పీక్ క్రేజ్‌ వేస్టెడ్ తాత’ అంటూ రజినీ పై ట్రోల్స్

Updated on: May 06, 2026 | 5:06 PM

MGR తర్వాత రాజకీయాల్లో తలపతి విజయ్ విజయం సాధించి చరిత్ర సృష్టించారు. పార్టీ పెట్టి తొలి ఎన్నికల్లోనే గెలిచి జననాయగన్ అయ్యారు. రజినీకాంత్ రాజకీయ ప్రవేశంపై పలుమార్లు ప్రకటించి, చివరికి వెనకడుగు వేశారు. ఈ నేపథ్యంలో, విజయ్ ధైర్యానికి, రజినీ సంశయానికి తేడాను చూపుతూ కొందరు రజినీని ట్రోల్ చేస్తున్నారు. తమిళ ప్రజల ఆశలు ఎలా అడియాశలు అయ్యాయో విశ్లేషించే కథనం.

MGR తర్వాత విజయ్‌ తలపతి చరిత్ర సృష్టించాడు. పార్టీ పెట్టిన తర్వాత వచ్చిన తొలి అసెంబ్లీ ఎన్నికల్లోనే విజయ్‌ విజయం సాధించాడు. జననాయగన్‌గా ఇప్పుడు కీర్తించబడుతున్నారు. ఇదంతా బానే ఉంది. కానీ ఇప్పుడు మధ్యలోకి రజినీని లాగి కొంత మంది తమిళ తంబీలు ట్రోల్ చేస్తున్నారు. ఎందుకంటే విజయ్‌ కంటే ముందు.. ఈ ఘనత రజినీ చేయాల్సింది కదా అని తంబీలు గుర్తు చేయడం లేదు దెప్పి పొడుస్తున్నారు. విజయ్‌ హీరోగా ఎదిగా క్రమంలోనే.. మరో పక్క స్టార్ ఇమేజ్‌లో.. పీక్స్‌లో ఉన్నాడు రజినీ. అలాంటి రజినీని రాజకీయాల్లోకి రావాలని తమిళ ప్రజలందరూ అప్పట్లో బలంగా కోరుకున్నారు. సీఎంగా సూపర్ స్టార్‌ను చూడాలని కలలు కన్నారు. కానీ రజినీలో తెలియని భయం. రావాలా వద్దా? వస్తే సీఎం అవుతానా? కానా? అన్నీ ఇలాంటి సందేహాలే. దీంతో ఏదీ తేల్చుకోలేని పరిస్థితికి చేరిపోయారు రజినీ. బాషా సినిమా తర్వాత రాజకీయాల్లోకి వస్తున్నాడన్నారు.. అప్పుడు రాలేదు. శివాజీ తర్వాత అన్నారు అప్పుడూ రాలేదు.. ఇలా రోజులు గడుస్తున్నా కొద్ది. ఓ ఫైన్ డే రాజకీయాల్లోకి వస్తున్నా అంటూ.. తల సంచలన ప్రకటన చేశాడు. దీంతో తమిళ ప్రజలు ఓ రేంజ్‌లో సెలబ్రేట్ చేసుకున్నారు. ఇక తమిళనాడులో అధికారం సూపర్ స్టార్‌తో.. మా బతుకుల్లో ఆనందం ఆయన వల్లే అన్న రేంజ్‌లో కామెంట్లు ప్రశంసలు.. మాటలు. అయితే వారి ఆశలన్నీ అడియాలయ్యాయి. రాజకీయాల్లోకి వస్తున్నానంటూ రజినీ ఎలా చెప్పారో… అంతే సింపుల్‌గా తనకు రాజకీయాలు పడవంటూ.. ఆరోగ్యం సహకరించడం లేదంటూ.. తప్పుకున్నాడు. అంతే సెలబ్రిటీలను సీఎం అంటూ అందలం ఎక్కించాలనే ఆశలో ఉన్న తమిళ తంబీలు.. ఇప్పుడు రజినీ రేంజ్‌ క్రేజ్ సంపాదించుకున్న విజయ్‌ వెనకపడ్డారు. ఆయన డేర్ చేశాడు. రిస్క్ చేశాడు సీఎం అవబోతున్నాడు. అయితే ఈ విషయాలనే గుర్తు చేస్తూ.. ఇప్పుడు రజినీని ట్రోల్ చేస్తున్నారు. కొందరు తమిళ తంబీలు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Thalapathy Vijay: ఒక్క ముక్కలో.. విజయ్‌ రాజకీయ, సినీ ప్రస్థానం

Published on: May 06, 2026 05:04 PM
Loading...
Unable to load recommendations.
Follow Us