Singer Chitra: సింగర్ చిత్ర భావోద్వేగం.. గుండెను పిండేసేలా పోస్ట్

Updated on: Apr 16, 2026 | 5:49 PM

ప్రముఖ గాయని చిత్ర తన కుమార్తె నందన పుట్టినరోజున హృదయవిదారక పోస్ట్ చేశారు. 15 ఏళ్లుగా ఆమె నందన మరణం తాలూకు వేదనను అనుభవిస్తున్నారు. 2011లో దుబాయ్‌లో జరిగిన ప్రమాదంలో డౌన్ సిండ్రోమ్‌తో బాధపడుతున్న నందన మరణించింది. చిత్ర ఆ పోస్ట్‌లో తన బాధను పంచుకుంటూ, నందన జ్ఞాపకార్థం ఒక ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.

తేనె కన్నా తీయనైన గొంతుతో వేలాది పాటలకు ప్రాణం పోసారు సింగర్‌ చిత్ర. కుమార్తెను కోల్పోయి 15 ఏళ్లుగా వేదన అనుభవిస్తూనే ఉన్నారు. దగ్గరి వాళ్లు చనిపోతేనే ఆ బాధ అనుభవించడం కష్టం. అలాంటిది కడుపున పుట్టిన పాప చనిపోతే ఆ తల్లి వేదన వర్ణనాతీతం. తాజాగా కుమార్తె నందనను తలుచుకుని తన బాధను ఓ పోస్ట్ రూపంలో చిత్ర పంచుకున్నారు. ‘కుమార్తె తనతో పాటు లేదనే నిజం తనను బాధపెడుతూనే ఉందనీ కానీ మళ్లీ తాము కలుసుకునేంత వరకు తన గుండెల్లో పాప ఎప్పటికీ ఉండిపోతుందని నందన ఫొటోని చిత్ర పోస్ట్ చేశారు. కేరళకు చెందిన చిత్ర.. తెలుగు సహా అన్ని భారతీయ భాషల్లో 25 వేలకు పైగా పాటలు పాడారు. ఇప్పటికీ పాడుతూనే ఉన్నారు. విజయ్ శంకర్‌తో వివాహమైన చాలా ఏళ్ల తర్వాత ఆమెకు 2002లో కూతురు పుట్టింది. నందన ను అల్లారు ముద్దుగా దంపతులు పెంచారు. అయితే పాప డౌన్‌ సిండ్రోమ్‌తో బాధపడేది. ఆ వ్యాధి లక్షణం ఏంటంటే మనిషిలో అసలు ఎదుగుదల ఉండదు. నందనకు తొమ్మిదేళ్ల వయసు ఉన్నప్పుడు ఒక కచేరి లో పాల్గొనడానికి దుబాయ్‌ వెళ్లింది చిత్ర. ఆ సమయంలో దురదృష్టవశాత్తూ హోటల్‌లోని స్విమ్మింగ్‌ పూల్‌లో పడి కన్నుమూసింది నందన. 2011లో ఈ ఘటన జరిగింది. తన కూతురి పేరుమీద ఓ ఛారిటబుల్‌ ట్రస్ట్ ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు చిత్ర. నందన బర్త్‌డే రోజున ఆమెను తలుచుకుని ఎమోషనలయ్యారామె. కూతురి ఫొటోను సోషల్ మీడియాలో షేర్‌ చేసి బర్త్ డే విషెస్ చెప్పారు. ‘ ‘స్వర్గంలో దేవ కన్యలతో సెలబ్రేషన్స్‌ జరుపుకుంటున్న నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ ఎమోషనల్ నోట్‌ను షేర్‌ చేశారు చిత్ర. ఇప్పుడీ పోస్ట్ వైరల్ అయ్యింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Mushroom: వామ్మో.. ఇది పుట్ట గొడుగా.. గొడుగా ??

గ్యాస్‌ కష్టాలు.. ఆటోలో సిలిండర్లను లాక్కెళ్ళిన మహిళలు

వింత దొంగను పట్టించిన సీసీ కెమెరా.. ఏం చేశాడో తెలుసా

చెట్ల కొమ్మలపై తిరిగే కోతి.. సడన్‌గా ఊయలెక్కి ఊగితే..

కోడిపుంజు వింత అరుపులు.. ఏం జరిగిందా అని చూడగా.. షాకింగ్‌ సీన్‌

Follow Us