బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర రణబీర్ కపూర్ Vs రణవీర్ సింగ్..
బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రణబీర్ కపూర్, రణవీర్ సింగ్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. రణవీర్ "దురంధర్ 2" రికార్డులను రణబీర్ "రామాయణ పార్ట్ 1" బద్దలు కొడుతోంది. నెక్స్ట్ నెంబర్ వన్ ఎవరు, వీరిద్దరికీ పోటీ ఇచ్చే మరో హీరో ఉన్నారా అనేది చర్చనీయాంశంగా మారింది.
బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఇద్దరు స్టార్ హీరోల మధ్య బిగ్ ఫైట్ జరుగుతోంది. యువ తరం సూపర్ స్టార్స్‌గా వెలుగొందుతున్న రణవీర్ సింగ్, రణబీర్ కపూర్ మధ్య బాక్సాఫీస్ వార్ పీక్స్ కు చేరింది. ఇటీవల రణ్వీర్ సింగ్ “దురంధర్ 2″తో సృష్టించిన రికార్డులను, రణబీర్ కపూర్ తన “రామాయణ పార్ట్ 1″ తో స్వల్ప వ్యవధిలోనే బ్రేక్ చేస్తూ దూసుకువెళ్తున్నారు.”దురంధర్ 2 ది రివెంజ్” ప్రపంచవ్యాప్తంగా 1800 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఆల్ టైం బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. అయితే ఆ రికార్డుల వేడి తగ్గకముందే దీపావళి కానుకగా నవంబర్ 5న విడుదలైన నితీష్ తివారీ “రామాయణ పార్ట్ 1” తో రణబీర్ కపూర్ కౌంటర్ అటాక్ మొదలుపెట్టారు. ఫస్ట్ మండే వసూళ్లలో “దురంధర్ 2” సృష్టించిన 60 కోట్ల నెట్ రికార్డ్‌ను “రామాయణ పార్ట్ 1” ఏకంగా 128 కోట్లకు పైగా గ్రాస్‌తో బ్రేక్ చేసింది. కేవలం ఐదు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 663 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లతో రణబీర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద రచ్చ చేస్తోంది. రణబీర్, రణవీర్‌ల మధ్య నంబర్ వన్ స్థానం కోసం తీవ్ర పోటీ నెలకొంది.
