న్యూ రికార్డ్స్ ను టార్గెట్ చేస్తున్న రామాయణ!

Updated on: May 24, 2026 | 2:40 PM

గ్లోబల్ స్థాయిలో బజ్ క్రియేట్ చేస్తున్న రామాయణ పార్ట్ వన్, దీపావళి కానుకగా విడుదల కానుంది. రణ్బీర్ కపూర్, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న ఈ మైథలాజికల్ చిత్రం, ప్రీ-రిలీజ్ బిజినెస్‌లో షారుక్ ఖాన్ కింగ్ సినిమా రికార్డును బ్రేక్ చేసే దిశగా అడుగులు వేస్తోంది. హిందీ హక్కులు 400 కోట్లకు పైగా పలుకుతున్నట్లు సమాచారం.

గ్లోబల్ స్థాయిలో బజ్ క్రియేట్ చేస్తున్న ఇండియన్ సినిమాలలో రామాయణ పార్ట్ వన్ ఒకటి. హాలీవుడ్ టీం వర్క్ చేస్తున్న ఈ చిత్రం దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమా, ప్రీ-రిలీజ్ బిజినెస్‌లో సరికొత్త రికార్డులను నెలకొల్పాలని చూస్తోంది. రణ్బీర్ కపూర్, సాయి పల్లవి జంటగా తెరకెక్కుతున్న ఈ మైథలాజికల్ మూవీ రెండు భాగాలుగా రూపొందుతోంది, మొదటి భాగం ఈ ఏడాది దీపావళికి విడుదల అవుతుంది. ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలను పెంచింది. ఇప్పటివరకు నార్త్ మార్కెట్‌లో అత్యధిక ప్రీ-రిలీజ్ బిజినెస్ రికార్డ్ షారుక్ ఖాన్ కింగ్ సినిమా పేరిట ఉంది. కింగ్ హిందీ వెర్షన్ థియేట్రికల్ రైట్స్ 250 కోట్లకు అమ్ముడయ్యాయి.

Follow Us