Ram Charan: ఓ పక్క రూ.కోట్లు.. ఇంకో పక్క ఇచ్చిన మాట.. సందిగ్ధంలో చరణ్

Updated on: Feb 12, 2026 | 9:56 AM

రామ్ చరణ్ 'పెద్ది' సినిమా క్రేజ్ పీక్స్‌కు చేరింది. చరణ్ కెరీర్‌లోనే రికార్డు స్థాయిలో $9.5 మిలియన్లకు ఓవర్సీస్ హక్కులు అమ్ముడవడంతో, టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఏప్రిల్ 30న విడుదల కానున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. అలాగే, సుకుమార్ తదుపరి చరణ్ ప్రాజెక్ట్‌కు అనుపమ ప‌రమేశ్వరన్‌ను ఎంపిక చేసినట్లు సమాచారం. ఇది గ్రామీణ నేపథ్యంలో రెండు భాగాలుగా రూపొందే అవకాశం ఉంది.

పెద్ది క్రేజ్ ఇప్పుడు పీక్స్‌లో ఉంది. బుచ్చిబాబు సనా డైరెక్షన్లో చరణ్ చేస్తున్న ఈ సినిమా ఓవర్సీస్ రైట్స్‌ కూడా ఇప్పుడు చరణ్‌ కెరీర్లోనే రికార్డ్‌ ధరకు అమ్ముడైపోవడం టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అవుతోంది. ఈ సినిమా ఓవర్సీస్ రైట్స్ ఏకంగా 9.5 మిలియన్స్ డాలర్స్‌కు అమ్ముడుపోయినట్టుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. గేమ్ చేంజర్‌ ప్లాప్ తర్వాత.. చరణ్‌ సినిమాకు ఈ రేంజ్‌ డీల్ సెట్టు అవ్వడం .. చెర్రీ క్రేజ్‌కు ఎగ్జాంపుల్‌గా కోట్ చేస్తున్నారు కొంత మంది ఫిల్మ్ అనలిస్టులు. ఇక ఈ విషయం పక్కకు పెడితే.. రామ్ చరణ్‌ పెద్ది సినిమా ఏప్రిల్ 30న వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది. మాట తప్ప కూడదని అంటారు. ఇప్పుడు అదే లైన్‌ను ఫాలో అవుతూ సకుమార్ మలయాళ బ్యూటీ అనుపమకు బంపర్ ఆఫర్ ఇచ్చాడు. రంగస్థలం సినిమా నుంచి తప్పించినందుకు ప్రతి ఫలంగా.. తను రామ్ చరణ్‌తో చేయబోయే అప్‌కమింగ్ సినిమాలో.. అనుపమను హీరోయిన్‌గా ఫిక్స్ చేసినట్టుగా ఇన్‌సైడ్ న్యూస్. ఇక ఈ విషయం పక్కకు పెడితే.. రామ్ చరణ్ సుక్కు సినిమా విలేజ్ డ్రామాగానే సాగడమే కాకుండా.. పుష్ప తరహాలో రెండు పార్ట్స్‌గా తెరకెక్కనుందని స్ట్రాంగ్ టాక్.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Dhurandhar: ధురంధర్ ఎఫెక్ట్‌.. హీరోకు తీవ్రవాదుల ధమ్కీ

Ustaad Bhagat Singh: తెలంగాణలో పవన్‌ సినిమాకు.. టికెట్ రేట్స్‌ పరేషాన్

Published on: Feb 12, 2026 09:55 AM