కరోనా మహమ్మారి తర్వాత డిజిటల్ మార్కెట్ అద్భుతమైన వృద్ధిని సాధించింది. దీనితో పాటు సినిమా ఓటీటీ హక్కులకు భారీ డిమాండ్ ఏర్పడింది. ఈ పరిణామం చిత్ర పరిశ్రమలో భారీ మార్పులకు కారణమైంది. ఒకప్పుడు రూ. 100 కోట్లతో భారీ స్టార్ హీరోల చిత్రాలు నిర్మించేవారు, కానీ ఇప్పుడు మధ్యశ్రేణి చిత్రాలకు సైతం ఈ స్థాయి బడ్జెట్ అవసరమవుతోంది. చిన్న సినిమాలకు కూడా రూ. 15 నుండి 20 కోట్లు ఖర్చవుతున్నాయి.