ప్రభాస్ సినిమాపై అదిరిపోయే అప్‌డేట్.. కానీ చిన్న ట్విస్ట్..

Updated on: Oct 23, 2026 | 11:16 AM

ప్రభాస్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫౌజీ మూవీ అప్‌డేట్ వచ్చేసింది. అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఓ స్పెషల్ గ్లిమ్స్ విడుదల కానుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాత రవిశంకర్ ఈ విషయాన్ని ధృవీకరించారు. అయితే, ఇది కేవలం సినిమా థీమ్, ప్రభాస్ లుక్‌కు సంబంధించిన శాంపిల్ మాత్రమేనని, బాహుబలి స్థాయి అంచనాలు వద్దని ఆయన స్పష్టం చేశారు.

రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఫౌజీ సినిమా నుంచి అదిరిపోయే అప్‌డేట్ వచ్చింది. అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఓ స్పెషల్ గ్లిమ్స్ విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అయితే, ఇందులో ఒక చిన్న ట్విస్ట్ ఉంది. లిటిల్ హార్ట్స్ ఫేమ్ మౌళి హీరోగా నటిస్తున్న దొంగనా కొడుకు సినిమా టీజర్ రిలీజ్ ప్రెస్ మీట్‌లో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాత రవిశంకర్ ఈ ఫౌజీ అప్‌డేట్‌ను వెల్లడించారు.అక్టోబర్ 23న ప్రభాస్ బర్త్‌డే కానుకగా ఫౌజీ స్పెషల్ గ్లిమ్స్‌ను విడుదల చేస్తున్నట్లు ఆయన కన్ఫర్మ్ చేశారు. తమ బ్యానర్‌ నుంచి వస్తున్న 418 సినిమా థియేటర్లలో ఈ గ్లిమ్స్‌ను ప్లే చేయబోతున్నట్లు ప్రకటించి అభిమానులకు సాలిడ్ కిక్ ఇచ్చారు. అయితే, ఈ గ్లిమ్స్‌ను బాహుబలి రేంజ్‌లో ఊహించుకోవద్దని నిర్మాత ముందే క్లారిటీ ఇచ్చారు. సినిమాలోని హీరో క్యారెక్టరైజేషన్, బేసిక్ స్టోరీ థీమ్, ప్రభాస్ లుక్, సినిమా బ్యాక్‌డ్రాప్ ఎలా ఉండబోతోందో చిన్న శాంపిల్‌గా మాత్రమే ఈ వీడియోను కట్ చేసినట్లు ఆయన తెలిపారు.

Loading...
Unable to load recommendations.
Follow Us