Prabhas: ప్రభాస్ సినిమాల లెక్కలన్నీ తారుమారు

Updated on: Sep 14, 2026 | 8:35 PM

ప్రభాస్ సినిమాల లైనప్ లో వరుస వాయిదాలు అభిమానుల సహనానికి పరీక్ష పెడుతున్నాయి. ఫౌజీ, స్పిరిట్ ఆలస్యం కావడంతో, ఆ ప్రభావం కల్కి 2 మరియు సలార్ 2 వంటి మోస్ట్ అవైటెడ్ సీక్వెల్స్‌పై పడుతోంది. దీంతో ప్రభాస్ భవిష్యత్ చిత్రాల షెడ్యూల్ పూర్తిగా తారుమారు అవుతోంది.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమాల లైనప్ చూస్తే ఏ హీరో ఫ్యాన్స్‌కైనా మతిపోవాల్సిందే. ఆయన చేతిలో ఉన్నవన్నీ భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్టులే. అయితే, ఈ ప్లానింగ్ ఎక్కడో మిస్ ఫైర్ అవుతున్నట్లు కనిపిస్తోంది. వరుసగా వస్తాయనుకున్న సినిమాలు వాయిదాల మీద వాయిదాలు పడుతూ ప్రభాస్ ఫ్యాన్స్ సహనానికి పరీక్ష పెడుతున్నాయి. ప్రభాస్ లైనప్‌లో ముందుగా రావాల్సిన ఫౌజీ సినిమా ఆలస్యమవుతోంది. డిసెంబర్ 3న విడుదల చేయాలని అనుకున్నప్పటికీ, మేకింగ్‌కు ఎక్కువ సమయం పడుతుండటంతో వాయిదా పడింది. దీని ప్రభావం సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పిరిట్ సినిమాపై పడుతోంది. ఫౌజీ పూర్తయితే కానీ స్పిరిట్ సెట్స్‌పైకి వెళ్లే అవకాశం లేదు. ఈ రెండు సినిమాల ఆలస్యం వల్ల ప్రభాస్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ప్రాజెక్టులుగా తెరకెక్కాల్సిన కల్కి 2, సలార్ 2 వంటి మోస్ట్ అవైటెడ్ సీక్వెల్స్ కూడా మరింత వెనక్కి వెళ్లిపోతున్నాయి. కల్కి 2 షూట్ కోసం ప్రభాస్ డేట్స్ 2027 రెండో అర్ధభాగంలోనే ఇచ్చే అవకాశం ఉంది. అలాగే, సలార్ 2 కూడా హోల్డ్‌లో పడిపోయింది. ప్రభాస్ చేతిలో ఇండస్ట్రీలోనే క్రేజీ ప్రాజెక్టులు ఉన్నప్పటికీ, వాటి విడుదల విషయంలో మాత్రం అభిమానులకు వెయిటింగ్ తప్పేలా లేదు. ఈ ఆలస్య వార్తలు తీవ్ర నిరాశనే మిగులుస్తున్నాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇల్లు పీకి పందిరేస్తున్నాయి పంట పొలాలు నాశనం.. పిల్లల పై దాడులు! తెలంగాణలో అసలు ఏం జరుగుతోంది?

బరువు తగ్గాలనుకుంటున్నారా..? CMR-NIN పరిశోధనలో సంచలన నిజాలు

లీటర్‌కు రూ.80 కోట్లు.. తేలు విషం రహస్యం ఇదే!

వైభవ్‌ లాంటి ఒక్క బ్యాటర్‌నైనా తయారు చేశారా? పాకిస్థాన్‌కు వసీం అక్రమ్‌ చురకలు

వలలో చిక్కిన 23 కేజీల “పండుగప్ప”.. వేలంలో కళ్లుచెదిరే రేటు!

Loading...
Unable to load recommendations.
Follow Us