Fauzi: ఫౌజీ డేట్ అదేనా.. ప్రభాస్ ఫ్యాన్స్‌కు షాక్ తప్పదా..?
ప్రభాస్ నటిస్తున్న ‘ఫౌజీ’ డిసెంబర్ 3న రావడంపై సందేహాలు నెలకొన్న నేపథ్యంలో కొత్త రిలీజ్ డేట్‌పై ఆసక్తి పెరిగింది. జనవరి 26న సినిమాను విడుదల చేయాలనే చర్చలు జరుగుతున్నట్లు కథనం పేర్కొంది. ఒకవేళ ‘ఫౌజీ’ జనవరికి మారితే, సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న ‘స్పిరిట్’పై కూడా ప్రభావం పడే అవకాశం ఉందని అంచనా. మార్చి 5న రావాల్సిన ‘స్పిరిట్’ కనీసం నెల రోజులు వాయిదా పడే అవకాశంపై కూడా టాక్ వినిపిస్తోంది.
ప్రభాస్ ఫౌజీ రిలీజ్ డేట్ వాయిదా పడటం దాదాపు ఖాయమవడంతో నెక్స్ట్ పాజిబుల్ డేట్ ఎప్పుడనే ఆసక్తి అందరిలో మొదలైందా..? ఈ పోస్ట్‌పోన్‌తో సందీప్ వంగా తెరకెక్కిస్తున్న స్పిరిట్ కూడా ఆన్ టైమ్‌కి రాకుండా లేట్ అయ్యే ఛాన్స్ ఉందా..? ఫౌజీ సినిమా రిలీజ్ అయ్యే కొత్త డేట్‌ను బట్టే స్పిరిట్ కూడా వస్తుందా రాదా అనేది ఫైనల్ కానుందా..? అసలు ఈ రెండు సినిమాల పరిస్థితేంటి..? ప్రభాస్ నటిస్తున్న ఫౌజీ డిసెంబర్ 3 నుంచి పోస్ట్‌పోన్ కావడం దాదాపు ఖాయమైపోయింది.. ఆ నెక్ట్స్ డేనే నాగచైతన్య వృషకర్మతో పాటు శ్రీశ్రీ, లెగసీ సినిమాల డేట్స్ లాక్ అయ్యాయి. ఈ లెక్కన జస్ట్ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. ప్రస్తుతం ఈ సినిమా నెక్స్ట్ పాజిబుల్ డేట్ ఏంటనే దానిపై చర్చలు సాగుతుండగా.. జనవరి 26న రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. జనవరి 26 కోసం నిర్మాతలు ఇప్పటికే బయ్యర్లతో సీరియస్‌గా డిస్కషన్స్ జరుపుతున్నారని తెలుస్తుంది. ఒకవేళ ఫౌజీ సినిమా జనవరికి షిఫ్ట్ అయితే ఆ ఎఫెక్ట్ స్పిరిట్‌పై గట్టిగానే పడే అవకాశం లేకపోలేదు. సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాను మార్చి 5న ప్లాన్ చేయగా.. ఇప్పుడు ఫౌజీ కారణ:గా అది కూడా కనీసం నెల రోజులు వాయిదా పడే ఛాన్సులున్నాయి. ఫౌజీ షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుంది. అలాగే పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్న స్పిరిట్ సినిమా షూట్ కూడా అప్పుడే 40 శాతం పూర్తైంది. అయితే ఇప్పటికప్పుడు ఫౌజీ డేట్ లాక్ చేసినా.. పోస్ట్ ప్రొడక్షన్‌తో పాటు ప్రమోషన్ కోసం కనీసం మూడు నెలలైనా కావాలి. మరి చూడాలిక.. ఈ బ్యాక్ టు బ్యాక్ సినిమాల రిలీజ్ డేట్స్‌పై మేకర్స్ ఎప్పటికి ఫుల్ క్లారిటీ ఇస్తారో..?
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Paradise: ప్యారడైజ్ ఫీవర్.. జడల్ జమానాలో నయా రికార్డ్
కమర్షియల్ సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న హీరోయిన్లు
బుడ్డోడిని పట్టించుకోరా? సెలక్టర్ల పై కృష్ణమాచారి శ్రీకాంత్ ఫైర్
వయసు దాటిన ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్..ఇక.. 44 ఏళ్లొచ్చినా సర్కార్ నౌకరీకి అర్హులే
