ఆకతాయిలకు జూనియర్ వార్నింగ్‌… ఎవ్వరినీ వదిలిపెట్టనన్న ఎన్టీఆర్‌..

Updated on: Oct 06, 2026 | 10:51 AM

టెక్నాలజీ దుర్వినియోగంతో డీప్‌ఫేక్ వీడియోల బెడద పెరుగుతోంది. ప్రముఖ నటీమణుల మార్ఫింగ్ వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంపై యంగ్ టైగర్ ఎన్టీఆర్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఇలాంటి వీడియోలు సృష్టించిన వారిపై చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పలువురు హీరోయిన్లు కూడా ఈ సమస్యపై ఆవేదన వ్యక్తం చేశారు.

పెరుగుతున్న టెక్నాలజీ ఎంత మంచి చేస్తుందో, అంతే చెడు కూడా చేస్తోంది. ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో లేటెస్ట్ టెక్నాలజీ దుర్వినియోగం తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. సీనియర్ బ్యూటీస్ నుంచి యంగ్ హీరోయిన్స్ వరకు చాలామంది ఈ ఏఐ ఆధారిత టెక్నాలజీ బాధితులే. ఈ నేపథ్యంలో డీప్‌ఫేక్ వీడియోల మిస్‌యూజ్ విషయంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తీవ్ర స్థాయిలో స్పందించారు.ఒక సూపర్ హిట్ పాటను ఏఐ టెక్నాలజీతో అభ్యంతరకరంగా మార్పు చేసి సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్న కొంతమంది ఆకతాయిల చర్యలపై తారక్ సీరియస్ అయ్యారు. ఈ డీప్‌ఫేక్ వీడియోను క్రియేట్ చేసిన వారిని వదిలిపెట్టేదే లేదంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. అంతేకాదు, ఇలాంటి వీడియోల విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలంటూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.గతంలో శ్రీలీల తన ఫోటోలను అభ్యంతరకరంగా మార్ఫ్ చేసి వైరల్ చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నివేదా థామస్ కూడా తను సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోను ఏఐ ద్వారా మార్ఫ్ చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తమన్నా, ప్రియాంక అరుళ్ మోహన్, రష్మిక మందన వంటి అగ్రతారలు సైతం మార్ఫింగ్ ఫోటోలు, వీడియోలతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us