Paradise: ప్యారడైజ్ ఫీవర్.. జడల్ జమానాలో నయా రికార్డ్
నాని, కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న ‘ది ప్యారడైజ్’ పాటలు సోషల్ మీడియాలో దూసుకెళ్తున్నాయి. అనిరుధ్ సంగీతంలో వచ్చిన ‘యేశనాగుల’ సాంగ్ కేవలం 17 రోజుల్లోనే 100 మిలియన్ వ్యూస్ దాటిందని కథనం చెబుతోంది. గతంలో ‘ఊ అంటావా’, ‘చుట్టమల్లే’ పాటలు సాధించిన వేగాన్ని అధిగమించి సరికొత్త రికార్డు సృష్టించినట్లు పేర్కొంది. మరో పాట కూడా 240 మిలియన్లకు పైగా వ్యూస్‌తో దూసుకెళ్తుండటంతో ‘ది ప్యారడైజ్’పై అంచనాలు మరింత పెరిగాయి.
ఓ సినిమాపై హైప్ పెరగడానికి ఒక్క పాట చాలు.. కానీ ప్యారడైజ్ నుంచి విడుదలైన రెండు పాటలు రప్ఫాడిస్తున్నాయి. ముఖ్యంగా ఈ మధ్యే విడుదలైన యేశనాగుల పాట అయితే సంచలనం రేపుతుంది. టాలీవుడ్ చరిత్రలో కొత్త హిస్టరీ క్రియేట్ చేసింది ఈ పాట.. అల్లు అర్జున్, ఎన్టీఆర్ రికార్డుల్ని సైతం వెనక్కి నెట్టేసారు నాని. మరి అదేంటో చూద్దామా..? నాని, కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న ప్యారడైజ్ సినిమాలోని పాటలు సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. అనిరుధ్ మ్యూజిక్ మ్యాజిక్‌కి తోడు వీళ్లద్దరి స్టెప్పులు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలవడంతో యేశనాగుల సాంగ్ సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. కేవలం 17 రోజుల్లోనే 100 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసి యూట్యూబ్‌లో ఫాస్టెస్ట్ తెలుగు సాంగ్‌గా నిలిచి కొత్త హిస్టరీ క్రియేట్ చేసింది. ఇంతకుముందు టాలీవుడ్‌లో పుష్ప సినిమాలోని ఊ అంటావా, అలాగే దేవర నుంచి వచ్చిన చుట్టమల్లే సాంగ్స్ ఈ 100 మిలియన్ల రికార్డ్‌ను వేగంగా అందుకున్నాయి. ఇప్పుడు వాటన్నింటినీ వెనక్కి నెట్టేసిన నాని ప్యారడైజ్ పాటతో నేరుగా నెంబర్ వన్ ప్లేస్‌లోకి దూసుకొచ్చారు. అల్లు అర్జున్, ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోల రికార్డులను సైతం క్రాస్ చేసి ఈ సాంగ్ టాప్ ట్రెండింగ్‌లో నిలిచింది. యేశనాగుల మాత్రమే కాదు.. ఆయా షేర్ సాంగ్ కూడా ఇప్పటికే 240 మిలియన్లకు పైగా వ్యూస్‌తో రప్ఫాడిస్తుంది. ఇలా వరసగా రెండు పాటలు చార్ట్‌బస్టర్ అవ్వడంతో సినిమాపై ఎక్స్‌పెక్టేషన్స్ పీక్స్‌కు చేరిపోయాయి. నెక్ట్స్ చేయబోయే ప్రమోషన్స్‌కు ఈ పాటలు మంచి బూస్టప్ ఇస్తున్నాయి. మరి ఈ రేంజ్ హైప్‌తో సెప్టెంబర్ 24న థియేటర్లలోకి వస్తున్న ప్యారడైజ్ ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కమర్షియల్ సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న హీరోయిన్లు
బుడ్డోడిని పట్టించుకోరా? సెలక్టర్ల పై కృష్ణమాచారి శ్రీకాంత్ ఫైర్
వయసు దాటిన ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్..ఇక.. 44 ఏళ్లొచ్చినా సర్కార్ నౌకరీకి అర్హులే
