నా తండ్రి తప్పుడు పని చేశాడు.. ఇంట్లో నుంచి గెంటేశా..
నైనిక..! సోషల్ మీడియాలో పాపులర్..! ఓ పాపుల్ డ్యాన్స్ షోతో బుల్లి తెర ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నైనిక.. బిగ్ బాస్ షోతో.. బిగ్ బాస్ సీజన్ 8తో మరింత క్రేజ్ సొంతం చేసుకుంది. ఇప్పుడు పలు షోల్లో కనిపిస్తూ వైరల్ అవుతూ వుంటుంది. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వూకు వెళ్లిన ఈ బ్యూటీ... తన పర్సనల్ విషయాలను గురించి బాహాటంగా చెప్పుకొచ్చింది.
తప్పుడు పని చేసినందుకు తన తండ్రిని ఇంటి నుంచి బయటికి గెంటేశా అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. తన నాన్న తనతో ఉండరని చెప్పిన నైనిక.. తన నాన్న మంచివాడు కాదంటూ.. డొమెస్టిక్ వైలెన్స్ చేసేవాడంటూ చెప్పుకొచ్చింది. నాన్న అమ్మని,నన్ను టార్చర్ చేశాడు. అందుకే నేను డాడీని ఇంటి నుంచి వెళ్లిపోమని చెప్పా.. మా అమ్మ నన్ను కష్టపడి పెంచింది. మా అమ్మలా నేను కూడా నా పిల్లలను పెంచలేను.. మా అమ్మకు ఓ సొంత ఇల్లు కొనివ్వడమే నా లక్ష్యం అని చెప్పుకొచ్చింది నైనికా. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. అయితే ఏకంగా కన్న తండ్రిపైనే నైనిక సంచలన కామెంట్స్ చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. తండ్రి అయినా సరే .. తప్పు చేసి ఇబ్బంది పెడితే.. తాట తీయాల్సిందే అనే కామెంట్ వస్తోంది. నైనిక డేర్ స్టెప్‌ను అందరూ కొనియాడేలా చేస్తోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
