Manchu manoj: రెచ్చగొట్టేలా మాటలు.. మనోజ్‌ చేసింది తప్పా ?? ఒప్పా ??

Updated on: Feb 15, 2025 | 1:47 PM

రెచ్చగొడితే పుచ్చిపోతావని మన తెలుగు టూ స్టేట్స్‌ లో ఓ డైలాగ్ సర్కులేట్ అవుతూ ఉంటుంది. అందుకు తగిన సందర్భం వచ్చినప్పుడల్లా.. ఈ లైన్ బయటికి వస్తుంటుంది. నెట్టంట వైరల్ కూడా అవుతుంది. ఇప్పుడు మంచు మనోజ్ విషయంలో కూడా ఇదే డైలాగ్‌.. ! మొత్తంగా కాదుకానీ అక్కడక్కడ వినిపిస్తోంది. అసలు రెచ్చగొడితే ఒరిగేదేముంది.. అవతలి వాళ్లు రియాక్టైతే గొడవవుతుంది.

రియాక్ట్ కాకపోతే అదో గాలి మాటగా మారుతుంది. మరి మంచు తాజాగా ఓ ఈవెంట్లో మాట్లాడిన మాటలు.. రెచ్చగొట్టేలా ఉన్నాయా? తన తండ్రి మోహన్ బాబును.. అన్న విష్ణును మరోసారి టార్గెట్ చేసేలానే ఉన్నాయా? అంతా ముగిసిందనుకున్న వివాదాన్ని మళ్లీ మనోజ్ లేపడానికి చేసే ప్రయత్నంలోనే ఇలా సెటైరికల్ కామెంట్స్ చేస్తున్నాడా? అసలు మనోజ్‌ చేసిన కామెంట్స్ ఏంటి? అవి నెట్టింట చేస్తున్న రచ్చేంటి.. తెలియలంటే వాచ్ దిస్ హ్యాష్ ట్యాగ్ వైరల్ టాపిక్ ! అందరికీ తెలిసిన కథే.. రెండు నెలల నుంచి మంచు ఇంట సాగుతున్న కథే..! అయితే ఈ కథే మళ్లీ షురూ అయింది. సీరియల్స్‌లో ఎపిసోడ్స్ ఎపిసోడ్స్‌గా.. బ్రేక్ ఇస్తూ… బ్రేకింగ్స్‌లా.. మంచు బ్రదర్స్ మధ్య వార్ సాగుతూ వస్తోంది. మొన్నటికి మొన్న తిరుపతిలోని తమ విద్యాలయాల ప్రాంగణంలో మోహన్ బాబు, విష్ణు ఇద్దరూ సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. ఈ తండ్రీ కొడుకులిద్దరూ సంతోషంగా పండగ జరుపుకున్నారు. ఇక మరో పక్క మనోజ్ ఒక్కడే మరో చోట సంక్రాంతి పండగ జరుపుకున్నాడు. తన భార్యతో కూతురితో భోగి మంటలు మండిస్తూ ఫోటోలకు ఫోజిచ్చాడు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Upasana Konidela: వాలెంటైన్స్ డే కు.. సరికొత్త అర్థం చెప్పిన ఉపాసన