Mahesh Babu: మహేష్ బాబు తగ్గేదేలే.. అప్పుడే తదుపరి సినిమా పై అప్డేట్

Updated on: Feb 18, 2026 | 7:52 PM

మహేష్ బాబు నటిస్తున్న వారణాసి సినిమా చిత్రీకరణ జూన్ నాటికి పూర్తవనుంది. రాజమౌళి దర్శకత్వంలో ఈ సినిమా పూర్తి కాగానే మహేష్ తదుపరి ప్రాజెక్ట్ ఏంటి అనే చర్చ మొదలైంది. హోంబలే ఫిల్మ్స్, సన్ పిక్చర్స్ వంటి ప్రముఖ నిర్మాణ సంస్థలు ఆయన డేట్స్ కోసం పోటీ పడుతున్నాయి. వారణాసి విడుదల తర్వాతే తన తదుపరి సినిమాపై మహేష్ బాబు స్పష్టత ఇవ్వనున్నారు.

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం వారణాసి చిత్రీకరణ పనులు జూన్ నాటికి పూర్తవుతాయని దర్శకుడు రాజమౌళి స్పష్టం చేశారు. సాధారణంగా ఒక సినిమా చేస్తుండగానే తన తదుపరి ప్రాజెక్టును ఖరారు చేసుకునే మహేష్ బాబు, ఈసారి మాత్రం వారణాసి పూర్తయ్యే వరకు తన సెంటిమెంట్‌ను పక్కనపెట్టి, తదుపరి సినిమా గురించి ఆలోచించడం లేదని తెలుస్తోంది. వారణాసి టాకీ పూర్తయిన తర్వాత కేవలం ప్రమోషన్స్, డబ్బింగ్ పనులు మాత్రమే మిగిలి ఉంటాయి. దీంతో మహేష్ బాబు డేట్స్ కోసం ప్రముఖ నిర్మాణ సంస్థలైన హోంబలే ఫిల్మ్స్, సన్ పిక్చర్స్ వంటివి ఇప్పటికే తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

తెలుగు సినిమా షూటింగ్‌ల సందడి.. ఏ హీరో ఎక్కడున్నాడు..

సీక్వెల్స్‌కు గుడ్‌బై చెబుతున్న కెప్టెన్లు.. ఇంతకీ కారణం అదేనా

సింహస్వప్నంగా కోస్ట్‌గార్డ్‌.. చమురు స్మగ్లింగ్‌కు చెక్‌

బద్ధలైన అగ్నిపర్వతం.. 1300 అడుగుల ఎత్తుకు ఎగసిపడ్డ లావా

Follow Us