కోట Vs కృష్ణ వంశీ !! ఒకప్పుడు వీళ్లు ఎంతలా గొడవ పడ్డారంటే ??

Updated on: Jul 16, 2025 | 9:20 PM

విలక్షణ నటుడు కోట శ్రీనివాస రావు మరణాన్ని ఎవ్వరూ జీర్ణించుకోవలేక పోతున్నారు. ఆయన్ను గుర్తు చేసుకుంటూ.. ఆయనకు సంబంధించిన బోలెడు విశేషాలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు ఆయన ఫ్యాన్స్. ఇక ఈ క్రమంలోనే కొందరు ఫ్యాన్స్ అప్పట్లో కోట వర్సర్ కృష్ణవంశీ మధ్య జరిగిన గొడవ గురించి షేర్ చేస్తున్నారు. దీంతో వీరిద్దరి మధ్య అసలు గొడవేంటనే చర్చ నెట్టింట మొదలైంది.

ట్యాలెంటెడ్ డైరెక్టర్‌గా ట్యాగ్ తెచ్చుకున్న కృష్ణవంశీ అప్పట్లో ఖడ్గం సినిమాను డైరెక్ట్ చేశాడు. ఆ సినిమాలో ఓ రోల్‌ కోసం ప్రకాశ్‌ రాజ్‌ను ఎంచుకున్నాడు. అయితే అందుకు గాను ప్రకాశ్‌ రాజ్ ఉత్తమ సహాయ నటుడిగా నంది అవార్డ్ అందుకున్నాడు. ఈ క్రమంలో ప్రకాశ్‌ రాజ్‌ను పొగుడుతూ.. తెలుగులో క్యారెక్టర్ ఆర్టిస్టుల కొరత ఉందని.. ఇంకా ఎక్కువ మంది నటులు రావాల్సిన అవసరం ఉందంటూ కృష్ణ వంశీ కామెంట్ చేశాడు. ఇక ఈ కామెంట్స్‌ పై సీరియస్ అయ్యారు కోట. తెలుగులో మంచి ఆర్టిస్టులు లేరని ఎలా అంటావ్ అంటూ.. కృష్ణ వంశీని నిలదీశారు. మీరు పాత్రలు ఇవ్వండి మన వాళ్లు టాలెంట్ చూపిస్తారంటూ కౌంటర్ ఇచ్చారు. దానికి కృష్ణ వంశీ కూడా అంతే ఆగ్రహంతో కోటకు కౌంటర్ ఇచ్చాడు. ఇలా వీరిద్దరి మధ్య వాగ్వాదం ముదిరింది. ఓ దశలో కోట.. కృష్ణ వంశీకి సవాలు కూడా విసిరే వరకు వచ్చింది. నీ సినిమాలో నాకో పాత్ర ఇవ్వు నేనేంటో చూపిస్తా అంటూ బాహాటంగా ఛాలెంజ్ చేశారు కోట. దీంతో ఈ వివాదం మరింత ముదిరి విషయం సినీ పెద్దల వరకు వెళ్లింది. వారి వల్లే ఈ ఇద్దరి మధ్య కాస్త సయోధ్య కుదిరింది. కట్ చేస్తే రాఖీ సినిమాలో కోటకు ఛాన్స్ ఇచ్చారు కృష్ణవంశీ. ఎన్టీఆర్ తండ్రిగా నటింపచేశాడు. కోట కూడా తన పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసి అందర్నీ ఆకట్టుకున్నారు. అలా ఈ ఇద్దరు తమ మధ్య గొడవలను మరిచిపోయారు. ఇక ఈ తర్వాత ఓ ఇంటర్వ్యూలో కృష్ణవంశీ కోట తో గొడవ గురించి మాట్లాడాడు. కోట ఓ గ్రేట్ ఆర్టిస్ట్‌.. ఆయనతో గొడవపడి ఉండకూడదంటూ బాధపడ్డారు. తన మాటలతో అప్పట్లో వైరల్ అయ్యాడు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పాటతో దేశాన్ని ఊపిన ఫోక్ సింగర్‌కు కింగ్ నాగ్ బంపర్ ఛాన్స్?

షో చూడు సర్‌ప్రైజ్‌ గిఫ్ట్ పట్టు.. సుడిగాలి సుధీర్ నుంచి బంపర్ ఆఫర్ !

‘నెలకు 40 లక్షలు భరణంగా ఇవ్వాలి’ మాజీ భార్య దెబ్బకు..

బంగారం లాంటి ఛాన్స్‌ వస్తే.. ఈ పిల్ల కాళ్లతో తన్నింది..

3 నిమిషాలకు 3 కోట్లు.. ఏ స్టార్ ఫిల్మ్ అయినా.. మనీ మ్యాటర్లో నో కాంప్రమైజ్‌!