దుల్కర్ సినిమా మీద అంచనాలు పెంచేసిన బన్నీ… అంతలా ఆ సినిమాలో ఏముంది?
మహానటి, సీతారామం వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న దుల్కర్ సల్మాన్, ఇప్పుడు "ఆకాశంలో ఒక తార"తో వస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ సీతారామం నాటి విజువల్ మ్యాజిక్ ను గుర్తుచేస్తోంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అల్లు అర్జున్ ఈ చిత్రాన్ని దుల్కర్ కెరీర్ లోనే బెస్ట్ మూవీగా అభివర్ణించడంతో అంచనాలు మరింత పెరిగాయి.
మహానటి, సీతారామం, లక్కీ భాస్కర్ వంటి విజయవంతమైన చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న దుల్కర్ సల్మాన్, తన తదుపరి చిత్రం “ఆకాశంలో ఒక తార” తో రాబోతున్నారు. ఈ సినిమాతో ఆయన ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ పడటం ఖాయమని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తెలుగులో దుల్కర్ సల్మాన్ సినిమా చేస్తున్నారంటే కచ్చితంగా అందులో ఏదో ఒక కొత్తదనం ఉంటుందని ప్రేక్షకులు ఆశిస్తున్నారు.తాజాగా విడుదలైన “ఆకాశంలో ఒక తార” ట్రైలర్ ఈ అంచనాలను మరింత పెంచింది. ట్రైలర్ చూస్తుంటే సీతారామం నాటి విజువల్ మ్యాజిక్, ఆ పోయెటిక్ వైబ్ మళ్ళీ గుర్తొస్తున్నాయని ప్రేక్షకులు అంటున్నారు. పవన్ సాధినేని టేకింగ్, సంగీతం, విజువల్స్ ప్రతీ ఫ్రేమ్ ను కొత్తగా చూపించాయి. ఒక సామాన్యుడి అసాధారణ కలను, అందులోని ఎమోషనల్ జర్నీని ట్రైలర్ లో అద్భుతంగా ఆవిష్కరించారు. గ్రామీణ నేపథ్యం నుండి ఆకాశమంత లక్ష్యాన్ని చేరుకునే ప్రయాణంలో వచ్చే ప్రేమ, ఎమోషన్స్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతున్నాయి. దుల్కర్ లుక్స్, ఆయన సెటిల్డ్ పర్ఫార్మెన్స్ తో పాటు హీరోయిన్ ప్రెజెన్స్ కూడా సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని భావిస్తున్నారు.
