దృశ్యం -3 విషయంలో కన్ఫ్యూజన్ ?

Updated on: Feb 15, 2026 | 1:10 PM

దృశ్యం 3 తెలుగు వెర్షన్ సస్పెన్స్ కొనసాగుతోంది. మలయాళ, హిందీ వెర్షన్లు వేగంగా పూర్తవుతున్నప్పటికీ, తెలుగులో వెంకటేష్ దృశ్యం వరల్డ్‌లోకి మళ్లీ వస్తారా లేదా అన్నది స్పష్టంగా లేదు. మలయాళ వెర్షన్ ఏప్రిల్‌లో విడుదల కానుండటంతో, తెలుగులో ఆలస్యంగా విడుదల చేస్తే ప్రేక్షకులు చూస్తారా అన్న సందేహంతో మేకర్స్ డైలమాలో ఉన్నారు.

దృశ్యం 3 చిత్రం విషయంలో కొనసాగుతున్న సస్పెన్స్‌కు ప్రస్తుతానికి తెరపడేలా లేదు. ఇప్పటికే మలయాళ మరియు హిందీ వెర్షన్ల పనులు చురుకుగా సాగుతున్నాయి. మలయాళ దృశ్యం 3ని దర్శకుడు జీతూ జోసెఫ్ వేగంగా పూర్తి చేశారు, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. బాలీవుడ్ బృందం కూడా దృశ్యం 3 షూటింగ్‌ను ప్రారంభించింది. మలయాళ వెర్షన్ ఏప్రిల్‌లో, హిందీ వెర్షన్ అక్టోబర్‌లో విడుదలయ్యేందుకు సిద్ధంగా ఉన్నాయని అధికారికంగా ధృవీకరించారు.

మరిన్ని వీడియోల కోసం :

వ్యూహం ఫలించింది..విజయం వరించింది వీడియో

చూస్తుండగానే కుప్పకూలిన మెట్రో పిల్లర్

ఈ భక్తి ఓ వింత .. ఆలయ గ్రిల్‌కు తాళాలు వేసే భక్తులు

భారీ ఆఫర్ వదిలేసిన రౌడీ బాయ్.. కారణం ఇదే..!

Loading...
Unable to load recommendations.
Follow Us