దృశ్యం 3 హిట్టా..? ఫట్టా..?

Updated on: May 24, 2026 | 1:28 PM

మోహన్‌లాల్, జీతు జోసెఫ్ కాంబినేషన్‌లో వచ్చిన దృశ్యం 3 చివరి భాగం విడుదలయ్యింది. మొదటి రెండు భాగాల మాదిరిగా దీనిలో కొత్తదనం లోపించింది. జార్జ్ కుట్టి కథ రొటీన్‌గా అనిపిస్తుంది. అయినప్పటికీ మోహన్‌లాల్ నటన, తెలుగు డబ్బింగ్, సంగీతం బాగున్నాయి. మునుపటి మ్యాజిక్ కోరుకునే ప్రేక్షకులకు కొంత నిరాశ కలగవచ్చు.

మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్, సంచలన దర్శకుడు జీతు జోసెఫ్ కాంబినేషన్‌లో వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ ఫ్రాంచైజీ దృశ్యం. ఈ సిరీస్‌లో వచ్చిన మొదటి రెండు భాగాలు సంచలనం సృష్టించాయి. తాజాగా ఇదే ఫ్రాంచైజీ నుంచి చివరి భాగం దృశ్యం 3 విడుదలయ్యింది. దృశ్యం 3 కథ జార్జ్ కుట్టి (మోహన్‌లాల్) తాను నిర్మించాలనుకున్న డ్రీమ్ ప్రాజెక్ట్ సినిమాను పూర్తి చేయడంతో ప్రారంభమవుతుంది. ఈ సినిమా విజయంతో మీడియా దృష్టి మళ్ళీ జార్జ్ కుట్టి కుటుంబంపై పడుతుంది. వరుణ్ డెడ్ బాడీకి సంబంధించిన ఆధారాలు సంపాదించే ప్రయత్నంలో రిపోర్టర్లు ఉంటారు. తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి జార్జ్ కుట్టి ఎలాంటి ఎత్తుగడలు వేసాడు అనేది సినిమా కథాంశం.

 

Loading...
Unable to load recommendations.
Follow Us