Deepika Padukone: కల్కి సీక్వెల్ నుంచి దీపిక అవుట్ మరి.. ఆ ఛాన్స్ ఎవరికో ??
'కల్కి సీక్వెల్'పై షాకింగ్ న్యూస్ చెప్పింది నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్. కల్కి సీక్వెల్‌లో నటి దీపిక పదుకోన్ నటించడం లేదంటూ తమ సోషల్ మీడియా హ్యాండిల్ ఎక్స్‌లో అఫిషియల్‌గా ఎనౌన్స్ చేసింది. దీంతో ఇప్పుడీ న్యూస్.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. దీంతో.. దీపికకు రీప్లేస్‌మెంట్ ఎవరనే చర్చ సోషల్ మీడియాలో జరుగుతోంది.
కల్కి 2989AD ఫస్ట్ పార్ట్‌లో దీపికాతో సుదీర్ఘమైన ప్రయాణం చేసినప్పటికీ.. దాని స్వీకెల్‌లో ..దీపికా నటించరని వైజయంతీ మూవీస్ తమ పోస్ట్‌లో రాసుకొచ్చింది. అయితే.. గొప్ప టీమ్‌తో కల్కి సీక్వెల్ మీ ముందుకు వస్తుందని నిర్మాణ సంస్థ వెల్లడించింది. అంతేకాదు.. బాగా ఆలోచించిన తర్వాతే.. దీపిక భాగస్వామ్యం విషయంలో ఓ నిర్ణయం తీసుకున్నట్లు కూడా వైజయంతి మూవీస్ క్లారిటీ ఇచ్చింది. ‘కల్కి వంటి చిత్రానికి నిబద్ధత చాలా అవసరం. ఆమె భవిష్యత్‌లో మరెన్నో సినిమాలు చేయాలని మేం ఆకాంక్షిస్తున్నాం. ‘ అని సోషల్‌మీడియాలో ఒక పోస్ట్ షేర్ చేసింది ఈ స్టార్ ప్రొడక్షన్ కంపెనీ. ఇక సైన్స్ ఫిక్షన్ మూవీగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘కల్కి 2898 ఏడీ’ లో దీపికా పదుకొణె సుమతి పాత్రలో అద్భుతమైన నటనతో సినిమాకే హైలైట్‌గా నిలిచారు. కానీ ఇప్పుడు దీపిక తప్పుకోవడంతో.. కల్కి సీక్వెల్‌లో ఆమె స్థానంలో ఎవరు నటిస్తారనే చర్చ.. ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతోంది!
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఏపీలో నాలుగు రోజులుగా నిలిచిన NTR వైద్య సేవలు
OG: ట్రెండ్ సెట్ చేసిన OG.. ఇది క్రేజీ ఐడియా గురూ
కళ్లు చెదిరే ఆస్తులు కూడబెట్టిన ADE అంబేద్కర్
పేద యువత బతుకును.. ఫుట్‌బాల్‌తో మార్చిన రాథోడ్
TOP 9 ET News: మిరాయ్ హీరోకు కోట్ల విలువ చేసే సర్‌ప్రైజ్ గిఫ్ట్
