బిగ్ బీకి మరోసారి బిగ్ వార్నింగ్

Updated on: Nov 19, 2026 | 1:20 PM

బాలీవుడ్ ప్రముఖులు అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్‌లకు చంపేస్తామని గ్యాంగ్‌స్టర్ గోల్డీ ధిల్లాన్ నుండి తీవ్ర బెదిరింపులు వచ్చాయి. ముంబైలో 200 మంది అనుచరులు సిద్ధంగా ఉన్నారని, బుల్లెట్ ప్రూఫ్ గాజులు కూడా కాపాడలేవని గోల్డీ ధిల్లాన్ హెచ్చరించాడు. పోలీసులు ఈ బెదిరింపులపై దర్యాప్తు చేస్తున్నారు.

బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్, ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్‌లకు మరోసారి గ్యాంగ్‌స్టర్ల నుండి తీవ్ర బెదిరింపులు రావడంతో బాలీవుడ్ కలవరపడుతోంది. గ్యాంగ్‌స్టర్ గోల్డీ ధిల్లాన్ అమితాబ్, అభిషేక్‌లను చంపేస్తామని ప్రకటించడం కలకలం రేపింది. ఈ ప్రకటనతో ఇండస్ట్రీలో తీవ్ర ఆందోళన నెలకొంది.గోల్డీ ధిల్లాన్ సోషల్ మీడియా ద్వారా తాను అమితాబ్, అభిషేక్‌లను టార్గెట్ చేశానని, ముంబైలో తన అనుచరులు 200 మంది సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నాడు. బుల్లెట్ ప్రూఫ్ గాజులు లేదా జాకెట్లు వారిని రక్షించలేవని హెచ్చరించాడు. ఈ బెదిరింపులపై పోలీసులు వెంటనే స్పందించి ఆరా తీస్తున్నారు. ఈ పోస్ట్‌లో నిజమెంత అనేదానిపై దృష్టి సారించారు. ఇటీవల ఢిల్లీ పోలీసులు గోల్డీ ధిల్లాన్ ఇద్దరు అనుచరులను అరెస్ట్ చేశారు. ముంబైలోని అమితాబ్ నివాసం జల్సా దగ్గర కాల్పులకు ప్రయత్నించినట్లు ఢిల్లీ పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అమితాబ్, అభిషేక్‌తో పాటు ఢిల్లీకి చెందిన ఒక వ్యాపారిని కూడా గోల్డీ ధిల్లాన్ గ్యాంగ్ లక్ష్యంగా చేసుకున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది.

Published on: Nov 19, 2026 01:10 PM
Loading...
Unable to load recommendations.
Follow Us