వరల్డ్ కప్‌కు సెలక్ట్ చేయలేదనే కోపంతో సినిమాల్లోకి.. కట్ చేస్తే స్టార్ డైరెక్టర్‌గా..
క్రికెటర్‌గా రాణించాలనుకున్న ఆదిత్య ధర్ కల అండర్-19 జట్టులో చోటు దక్కకపోవడంతో బెడిసికొట్టింది. నిరాశ చెందకుండా, స్నేహితుల సలహాపై సినిమా రంగంలోకి అడుగుపెట్టారు. ప్రియదర్శన్ వద్ద అసిస్టెంట్‌గా మొదలుపెట్టి, కష్టపడి 'ధురంధర్' సినిమాతో 1300 కోట్లు సాధించి బ్లాక్‌బస్టర్ డైరెక్టర్‌గా ఎదిగారు. ఇది వైఫల్యం నుండి విజయానికి చేరిన స్ఫూర్తిదాయక ప్రస్థానం.
ఓ రంగంలోని రాణించాలనే ప్రయత్నం బెడిసికొడితే.. చాలా మంది కృంగిపోతారు. తమ జీవితమ ముగినినట్టే అంటూ ఫీలవుతుంటారు. కానీ బాలీవుడ్ డైరెక్టర్ ఆదిత్య ధర్ మాత్రం అలా చేయలేదు. మరో రంగాన్ని ఎంచుకుని అత్యున్నత శిఖరానికి వెళ్లాడు. తన ప్రయత్నంతో ఇప్పుడు ఇండియాలో హాట్ టాపిక్ అవుతున్నాడు. ధురంధర్ మూవీ డైరెక్టర్ ఆదిత్య ధర్ .. మొదట క్రికెటర్ అవ్వాలనుకున్నాడు. చిన్నప్పట్టి నుంచి ఇండియన్ జర్సీని తన ఒంటిపై చూడాలని కలలు కన్నాడు. అండర్-19 జట్టులో చోటు సంపాదించాలని ఎంతో కష్టపడ్డాడు. అయితే, 2002 అండర్-19 వరల్డ్ కప్‌కి ఆదిత్య ధర్ ఎంపిక కాలేదు. దీంతో తాను ఎంపిక కాకపోవడానికి రాజకీయాలు, పలుకుబడి, పక్షవాత వైఖరే కారణమని ఫీలైన ఆదిత్య ధర్.. క్రికెట్‌ను వదిలేసేందుకు నిర్ణయించుకున్నాడు. ఈక్రమంలోనే తన స్నేహితులు ఆదిత్య ధర్‌ను గార్డిష్ సినిమాను చూడమని సలహా ఇచ్చారట. ఆ సినిమా చూశాక తన జీవితం మలుపు తిరిగిందని.. దర్శకుడు కావాలనే కోరిక తనకు పుట్టినట్టు ఓ ఇంటర్వ్యూలో ఆదిత్య ధర్ చెప్పుకొచ్చాడు. అందుకోసం మొదట ముంబై చేరుకుని.. స్టార్ డైరెక్టర్ ప్రియదర్శన్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా తన సినీ ప్రయాణాన్ని మొదలు పెట్టాడు ఆదిత్య ధర్. కట్ చేస్తే ధురంధర్ సినిమాతో ఇప్పుడు ఇండియన్ ఫిల్మ్ ఫెటర్నిటీలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. 1300 కోట్లు కలెక్ట్ చేసిన సినిమాకు డైరెక్టర్‌గా హిస్టరీ కెక్కాడు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వాటి మీద ఆసక్తితో.. భారీగా డబ్బును చేజార్చుకున్నాడు.. అయితే..