Bigg Boss Telugu 10: 15 లక్షల్లో.. మిథిలేష్‌కు మిగిలేది మరీ అంతేనా.. ఏదో అనుకున్నాడు పాపం!

Updated on: Oct 09, 2026 | 4:54 PM

బిగ్‌బాస్‌ తెలుగు 10లో రూ.15 లక్షల సూట్‌కేస్‌తో బయటకు వచ్చిన మిథిలేష్‌ రెడ్డి తన నిర్ణయంపై మరోసారి స్పందించాడు. పన్నులు, ఇతర కోతలు పోను తనకు సుమారు రూ.10 లక్షలు మాత్రమే చేతికి వస్తాయని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించినట్లు సమాచారం. హౌస్‌లో ఎక్కువ రోజులు ఉండటం కంటే గుర్తింపు సంపాదించడమే తన లక్ష్యమని చెప్పాడు. రెండు రోజుల్లోనే కావాల్సిన ప్రచారం వచ్చిందని, అందుకే సూట్‌కేస్‌ తీసుకుని బయటకు వచ్చానని వివరించాడు.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 ఆసక్తికరంగా సాగుతోంది. సెప్టెంబర్ 07న ప్రారంభమైన ఈ రియాలిటీ షో ఇప్పటికే సక్సెస్ ఫుల్ గా మూడు వారాలు పూర్తి చేసుకుంది. నాలుగో వారం కూడా దాదాపు ఎండింగ్ కు వచ్చేసింది. మొదటి వారం ఛైత్ర ఎలిమినేట్ కాగా రెండో వారం ప్రముఖ నటుడు కృష్ణుడు బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చారు. ఇక మూడో వారం శృష్టి ఎలిమినేట్ అయింది. ఇదిలా ఉంటే గతవారం ముగ్గురు కామనర్స్ వైల్డ్ కార్డ్ ద్వారా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టారు. ఇందులో భల్లాలదేవగా శ్రీముఖి వల్ల ట్యాగ్ తెచ్చుకున్న మిథిలేష్ రెడ్డి హౌస్ లోకి వెళ్లాడు. మరో కంటెస్టెంట్ రామకృష్ణను ఓడించి మరీ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు కానీ.. వెళ్లిన రెండు రోజులకే 15 లక్షల రూపాయల సూట్ కేస్ తో బయటకు వచ్చాడు. బిగ్ బాస్ తెలుగు హిస్టరీలోనే ఇలా జరగడం ఇదే మొదటిసారి. కేవలం రెండు రోజుల్లోనే హౌస్ లో ఉన్న మిథిలేష్ రూ.15 లక్షలతో బయటకు రావడంపై అందరూ ఆశ్చర్యపోయారు. కొంత మంది సపోర్ట్ చేస్తే.. మరి కొంత మంది ట్రోల్ చేశారు. 100 రోజులపాటు హౌస్ లో ఉన్నప్పటికీ వచ్చే ప్రైజ్ మనీ కంటే కూడా రెండు రోజులకి ఈ 15 లక్షల రూపాయలే ఎక్కువ అంటూ కొందరైతే మిథిలేష్ నిర్ణయాన్ని ఆకాశానికెత్తారు. ఈ క్రమంలోనే 15లక్షల్లో మథిలేష్‌కు ఎంత చేతికొచ్చింది అనే విషయం నెట్టింట ఇప్పుడు ఇంట్రెస్టింగ్‌ గా మారింది. రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూకు వెళ్లిన మిథిలేష్.. బిగ్ బాస్ షోలో తనకు 15 లక్షల రూపాయలు వచ్చినప్పటికీ కటింగ్స్, ట్యాక్స్ లు పోను మిగిలేది కేవలం 10 లక్షలు మాత్రమేనని అంటూ చెప్పుకొచ్చాడు. తాను బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిందే గుర్తింపు కోసమని.. . అయితే రెండు రోజులకే తనకు కావాల్సినంత పబ్లిసిటీ వచ్చేసిందని.. అందుకే 15 లక్షల సూట్ కేస్ తో బయటకు వచ్చా… అంటూ మరో సారి తన నిర్ణయాన్ని సమర్థించుకున్నాడు ఇతను.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

OTTలో మెంటలెక్కించే క్రైమ్‌ థ్రిల్లర్ ఈ సినిమా ఎలా ఉందంటే…?

Loading...
Unable to load recommendations.
Follow Us