బిగ్ బాస్‌ టాస్కులేమో కానీ ఆ కంటెస్టెంట్ నడుము విరిగినంత పనైంది

Updated on: Sep 17, 2026 | 12:04 PM

బిగ్ బాస్ తమిళ్ సీజన్ 10లో టాస్క్ తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. కంటెస్టెంట్ల మధ్య జరిగిన తోపులాటలో ఒకరి వీపుపై మరొకరు ఎక్కడంతో ఓ కంటెస్టెంట్‌కు తీవ్ర గాయమైంది. ఆమె నడుము విరిగినంత పనైందని సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

బిగ్ బాస్ రియాలిటీ షో అంటేనే టాస్కులు, అందులో కంటెస్టెంట్ల అతి ఉత్సాహం సహజం. ఒళ్ళు పై తెలియకుండా దూసుకుపోయే క్రమంలో గాయాలపాలవడం, పక్కవారిని గాయపరచడం తరచుగా జరుగుతుంటుంది. ప్రస్తుతం పక్కన రాష్ట్రం తమిళనాడులో జరుగుతున్న బిగ్ బాస్ సీజన్ 10లోనూ ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. టాస్కులో కంటెస్టెంట్ల ఓవర్ యాక్షన్ పుణ్యమా అని ఒక కంటెస్టెంట్‌కు తీవ్ర గాయమై, ఆమె నడుము విరిగినంత పనైంది.తమిళ బిగ్ బాస్ సీజన్ 10లో ప్రవేశపెట్టిన నైట్ టాస్క్లో భాగంగా కంటెస్టెంట్లు రెచ్చిపోయారు. రాత్రిపూట ప్రేక్షకులకు కంటెంట్ అందించాలనే ఉద్దేశంతో ఈ సీజన్‌లో నైట్ టాస్కులను ప్రవేశపెట్టారు. ఇందులో రాత్రంతా నిద్రపోకుండా వినోదాత్మకంగా ఏదైనా చేయాలని బిగ్ బాస్ కంటెస్టెంట్లకు సూచించారు.బిగ్ బాస్ ఇచ్చిన ఒక ఫైనల్ టాస్కులో భాగంగా కంటెస్టెంట్లు ఒకరినొకరు తోసుకుంటూ బీభత్సం సృష్టించారు. ఈ క్రమంలోనే రే టీంకు చెందిన లక్ష్మీప్రియ, ఆనందిల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. అయితే, ఈ టాస్కులో ఒక కంటెస్టెంట్ వీపుపై మరో కంటెస్టెంట్ ఎక్కడంతో ఆమె తీవ్రంగా గాయపడింది.

Loading...
Unable to load recommendations.
Follow Us