భర్త అన్నాక గొడవపడనా ?? అంత మాత్రానికే విడాకులా ?? ప్లేటు ఫిరాయించిన అమర్ భార్య!

Updated on: Apr 20, 2025 | 7:35 PM

సోషల్ మీడియా...! బుల్లి తెరపై టెలీకాస్ట్ అవుతున్న షోలు! ఈ రెండు చాలు.. టీవీ సెలబ్రిటీల పర్సనల్‌ లైఫ్ తెలుసుకోడానికి! ఎస్ ! ఒకప్పుడు ఎంటర్‌ టైన్మెంట్ అంటే.. వేరే కాను.. ఇప్పుడు ఎంటర్‌టైన్మెంట్ అనేది ప్రతీ దాని నుంచి పొందుతున్నారు తెలుగు జనాలు. అందులో తమకిష్టమైన టీవీ సీరియల్‌ నటీనటుల జీవితాలను మాత్రం.. క్షుణ్నంగా తెలుసుకునేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.

ఇక టీవీ సీరియల్ స్టార్స్ కూడా… మోహమాటానికి పోకుండా… తమ పర్సనల్ లైప్‌ను.. ఏ మాత్రం మిస్సవ్వకుండా జనాలకు చెబుతున్నారు. అయితే షోల్లో వివరిస్తున్నారు… లేదంటే.. టూర్స్ పేరుతో.. తమ సొంత యూట్యూబ్‌ ఛానెల్లో వీడియో చేసి పెడుతున్నారు. అలా నెట్టింట వైరల్ అవుతూ లేని పోని చిక్కుల్లో పడుతున్నారు. సేమ్ ఇలాగే సీరియల్ హీరో కమ్ బిగ్ బాస్ ఫేమ్ అమర్‌దీప్ కూడా తన భార్య తేజస్విని సమేతంగా చిక్కుల్లో పడ్డాడు. ఓ పక్క సీరియల్స్‌ చేసుకుంటూ .. ఇంకో పక్క షోలతో.. సంపాదనలో బిజీగా ఉన్న అమర్ దీప్ , తేజస్విని జోడీ.. రీసెంట్‌గా ఓ షోకు వెళ్లారు. ఆ షోలో ఒకరికొకరు జంటగా సంతోషంగా లేమంటూ చెప్పారు. పైగా ఎమోషనల్ అయ్యారు. అయితే ఇదంతా షో కోసం చెప్పారో.. లేక నిజమే చెప్పారో .. అనేది పక్కకు పెడితే.. వారి మాటలతో నెట్టింట తెగ వైరల్ అయ్యారు. దాంతో పాటే వీరిద్దరూ త్వరలో విడిపోతున్నారనే రూమర్‌ వచ్చేలా చేసుకున్నారు. అయితే ఈ రూమరే నెట్టింట స్టిల్ తిరుగుతూ.. వారిద్దర్నీ ఇబ్బందిపెడుతుండడంతో… తాజాగా ఓ ఇంటర్వ్యూకు వెళ్లిన తేజస్విని ఈ రూమర్‌కు చెక్ పెట్టే ప్రయత్నం చేశారు. తమ విడాకుల వార్తల్లో నిజం లేదని అదంతా అబద్దం అని తేల్చారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇది మామూలు పూల చొక్కా కాదు.. రేట్‌ తెలిస్తే.. గుండె జారుతుంది

Naga Chaitanya: చైతూకు ఇంకో తమ్ముడు ఉన్నాడా ??

బోర్డు తిప్పేసి.. సరికొత్తగా జనాల్లోకి పచ్చళ్ల సిస్టర్స్

దేవుళ్లతో కామెడీలొద్దు.. ఇచ్చిపడేస్తారు…