Bellamkonda Sai Sreenivas: పెళ్లి చేసుకోబోతున్న బెల్లం కొండ.. అమ్మాయి ఎవరో తెలుసా

Updated on: Mar 08, 2026 | 8:12 PM

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ త్వరలో కావ్య రెడ్డిని వివాహం చేసుకోబోతున్నారనే వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇండస్ట్రీతో సంబంధం లేని కావ్య రెడ్డి తాత జడ్జి, నాన్న లాయర్. రెండు కుటుంబాల మధ్య సన్నిహిత సంబంధాలున్నాయి. ఈ పరిచయం మూడు ముళ్ల బంధంగా మారబోతుందని టీవీ9 వెల్లడించింది.

నటుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ త్వరలో వివాహం చేసుకోబోతున్నారనే వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. విజయ్ దేవరకొండ, అల్లు శిరీష్ వంటి యువ నటుల వరుసలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కూడా తన బ్యాచిలర్ జీవితానికి వీడ్కోలు పలకనున్నారని సమాచారం. ఆయన తన ప్రేయసి కావ్య రెడ్డితో పెళ్లి పీటలెక్కబోతున్నట్లు టీవీ9 నివేదించింది. కావ్య రెడ్డి సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తి కాదు. ఆమె కుటుంబ నేపథ్యం ప్రకారం, ఆమె తాత జడ్జిగా పని చేయగా, ఆమె తండ్రి న్యాయవాది. బెల్లంకొండ కుటుంబానికి, కావ్య రెడ్డి కుటుంబానికి చాలా కాలంగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ ఇరు కుటుంబాల మధ్య ఉన్న పరిచయం ఇప్పుడు వివాహ బంధంగా మారబోతోంది. ఈ వార్త ప్రస్తుతం విస్తృతంగా చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Nayanthara: రూ.31కోట్లు పెట్టి అపార్ట్‌మెంట్ కొన్న నయన్

Ustaad Bhagat Singh: రిలీజ్‌కు ముందే రూ.200 కోట్లు ?? దటీజ్‌ పవన్‌ మ్యాజిక్

Rajendra Prasad: సెల్ఫీ అడిగిన పిల్లాడిని పక్కకు నెట్టేసిన రాజేంద్రప్రసాద్

Rukmini Vasanth: హీరోయిన్‌ అయితే మాత్రం.. రాంగ్ యాంగిల్స్‌లో ఫోటోలు తీస్తారా ??

Weather Update: తెలుగు రాష్ట్రాల్లో మండిపోతున్న ఎండలు

Follow Us