Balakrishna : కన్నీళ్లు పెట్టుకున్న బాలయ్య.. కలిచివేస్తున్న వీడియో..

Updated on: Aug 21, 2025 | 9:47 PM

నందమూరి బాలకృష్ణ క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. భారీ డైలాగులతో.. వీరోచిత పోరాటాలతో.. తెలుగు ఫిల్మ్ లవర్స్‌కు గూస్ బంప్స్ తెప్పించే బాలయ్య... ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు. కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోతో ఇప్పుడు అందర్నీ షాకయ్యేలా చేస్తున్నారు . అసలు ఏం జరిగిందో తెలుసా.. ?

సీనియర్ ఎన్టీఆర్ పెద్ద కుమారుడు నందమూరి జయకృష్ణ సతీమణి పద్మజ అనారోగ్యంతో ఆగస్టు 19న కన్నుమూశారు. విషయం తెలియగానే జయకృష్ణ ఇంటికి చేరుకున్న నందమూరి కుటుంబ సభ్యులు ఆమె పార్థివదేహానికి నివాళులర్పించారు. సీఎం చంద్రబాబు కూడా పద్మజ భౌతికకాయానికి నివాళులు అర్పించారు. ఈ క్రమంలోనే సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. అయితే అలా ఆయన మాట్లాడుతుండగా… సీఎం చంద్రబాబు పక్కనే ఉన్న బాలకృష్ణ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యారు. అయితే ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాలయ్య ఫ్యాన్స్‌ని కలిచివేస్తోంది.

Published on: Aug 21, 2025 09:34 PM
Loading...
Unable to load recommendations.
Follow Us