పెద్ద రిస్కే తీసుకోబోతున్న అనిల్ రావిపూడి..!

Updated on: Aug 04, 2026 | 12:04 PM

దర్శకుడు అనిల్ రావిపూడి తన కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి కొత్త ప్రయోగాలు చేయడానికి సిద్ధమవుతున్నారు. వెంకటేష్, కళ్యాణ్ రామ్ సినిమాతో పాటు యానిమేషన్ చిత్రాన్ని, బాలకృష్ణతో రెండో సినిమాను ప్లాన్ చేస్తున్నారు. జాతీయ అవార్డు గెలుచుకున్న భగవంత్ కేసరి తర్వాత బాలయ్యతో అనిల్ ఎలాంటి కథను సిద్ధం చేస్తారనే ఆసక్తి నెలకొంది. వచ్చే మూడేళ్ల వరకు ఆయన డైరీ నిండుగా ఉంది.

ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి ప్రస్తుతం వెంకటేష్, కళ్యాణ్ రామ్ కాంబినేషన్‌లో రూపొందుతున్న మల్టీస్టారర్ చిత్రంతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే ఆయన తన తదుపరి ప్రాజెక్ట్‌లపై దృష్టి సారించారు. అనిల్ ఆలోచనలు ఎప్పుడూ ముందుంటాయని మరోసారి రుజువు చేస్తూ, రాబోయే మూడేళ్లకు తన డైరీని నింపేశారు. ఆయన సిద్ధం చేసిన రెండు కొత్త ప్రాజెక్ట్‌లలో ఒకటి పెద్ద ప్రయోగం కానుంది.ఎవరూ ఊహించని విధంగా అనిల్ రావిపూడి ఒక యానిమేషన్ సినిమాను తెరకెక్కించడానికి ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ ప్రయోగం ద్వారా కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి, తాను ఎలాంటి కథలనైనా అద్భుతంగా డీల్ చేయగలనని నిరూపించుకోవాలని చూస్తున్నారు. యానిమేషన్ సినిమా తర్వాత, అనిల్ బాలకృష్ణతో మరోసారి పనిచేయాలని ఆలోచిస్తున్నారు. గతంలో ఈ కాంబినేషన్‌లో వచ్చిన భగవంత్ కేసరి చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయం సాధించడమే కాకుండా, ప్రతిష్టాత్మకమైన జాతీయ అవార్డును కూడా గెలుచుకుంది.

Loading...
Unable to load recommendations.
Follow Us