Dacoit: కలెక్షన్స్‌లో 57% డ్రాపయిందా? ఇంకా కష్టపడాలి డెకాయిట్ !!

Updated on: Apr 15, 2026 | 12:43 PM

అడివి శేష్ 'డెకాయిట్' మొదటి వారం మంచి కలెక్షన్లు సాధించినా, వీకెండ్ తర్వాత వసూళ్లు తగ్గాయి. సినిమా ఫలితంతో సంబంధం లేకుండా ప్రమోషన్లు ఎంత ముఖ్యమో మరోసారి రుజువైంది. అడివి శేష్ తన ప్రమోషన్లను మరింత పెంచితేనే 'డెకాయిట్' బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు సృష్టిస్తుందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. వారాంతం తర్వాత పడిపోతున్న వసూళ్లను నిలబెట్టుకోవడానికి నిరంతర ప్రచారం అవసరం.

ఓ సినిమాను తెరకెక్కించడం కాదు.. ఓ సినిమాను రిలీజ్ చేయడం కాదు.. ఓ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్‌ రావడం కాదు.. ఓ సినిమాను ప్రమోట్ చేసుకోవడమే ఇప్పుడు బిగ్గెస్ట్ ఛాలెంజ్‌. ఎంత ప్రమోట్ చేస్తే అంత మైలేజ్. అంత మేర కలెక్షన్స్‌. ఈ విషయాన్ని వంటబట్టించుకున్నాయి కనుకే.. తెలుగు ఫిల్మ్ మేకర్స్‌.. ప్రమోషన్స్‌ను తెగ చేస్తుంటారు. సినిమా రిజల్ట్‌ తో సంబంధం లేకుండా రిలీజ్‌ డేట్ నుంచి మూడు నాలుగు వారాలు తెగ సందడి చేస్తుంటారు. డెకాయిట్ అడవి శేష్ కూడా ఇదే చేస్తున్నాడు. డెకాయిట్ సినిమా కలెక్షన్స్‌ను ఈ ఆదివారం వరకైతే పరిగెత్తించాడు. అయితే ఆ తర్వాత వచ్చే వీక్‌ డేస్‌లోనే ఈ హీరోకు అసలు కష్టం. అడవి శేష్‌, మృణాల్ లీడ్‌ రోల్లో.. షేనిల్ డియో డైరెక్షన్లో తెరకెక్కిన మూవీ డెకాయిట్. ఏప్రిల్ 10న ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. రిలీజ్‌ అయిన ఫస్ట్ వీక్ లో వరల్డ్ వైడ్ దాదాపుగా 34.77 కోట్ల గ్రాస్‌ మార్క్‌ను చేరుకుంది. తెలంగాణలో 4.20 కోట్లను.. ఆంధ్రలో 3.86 కోట్లను.. హిందీతో పాటు రెస్టాఫ్ ఇండియాలో 4.26 కోట్లను.. ఓవర్సీస్‌లో 4.81 కోట్లను వసూలు చేసింది. కలెక్షన్స్‌లో మంచి హోల్డ్‌ను కనబరుస్తున్న డెకాయిట్ మొదటి వారంతం ముగిసే సరికి దాదాపు 50శాతానికి పైగా పెట్టుబడిని వెనక్కి రాబట్టింది. అయితే డే3 ఆదివారంతో పోలిస్లే.. ఆ తర్వాత కలెక్షన్స్‌లో దాదాపు 57.8 పర్సెంట్ డ్రాప్ కనిపిస్తోందని ఫిల్మ్ అనలిస్టుల రిపోర్ట్. వీకెండ్‌తో పోలిస్తే వీక్ డేస్‌లో కలెక్షన్స్‌ లో డ్రాప్ కనిపించడం కామన్. అయితే దీన్ని లైట్ తీసుకోకుండా… అడవిశేష్ తన ప్రమోషన్స్‌కు మరింత పదునుపెడితే… డెకాయిట్ బాక్సాఫీస్ దగ్గర మరిన్ని అద్భుతాలు సృష్టిస్తుందనేది ఫిల్మ్ అనలిస్టులు చెబుతున్న మాట.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Nagarjuna Sagar: డేంజర్ బెల్స్ మోగిస్తున్న నాగార్జునసాగర్

అమెరికా బెదిరింపులు ఇరాన్ ప్రజలపై ఎలాంటి ప్రభావం చూపవు

Warangal: నిప్పుల కుంపటిలా మారిన వరంగల్

Medicos Reels: వైద్యానికి రీల్స్ వైరస్ పట్టిందా..?

Iran vs USA Conflict: యుద్ధం ఇలాగే కొనసాగితే భారత్ చమురు అవసరాల పై భారం

Follow Us