విజయ్‌కు షాకిచ్చిన కొడుకు జేసన్

Updated on: Mar 04, 2026 | 10:05 AM

తమిళ క్రేజీ హీరో దళపతి విజయ్ పర్సనల్‌ జీవితం ఇప్పుడు వివాదంగా మారింది. గత కొంతకాలంగా విజయ్, ఆయన భార్య సంగీత విడివిడిగా ఉంటున్నారని సమాచారం. ఇటీవల ఆమె కోర్టును ఆశ్రయించినట్లు వార్తలు వచ్చాయి. దీంతో దశాబ్దాల పాటు అన్యోన్యంగా ఉన్న ఈ జంట మధ్య మనస్పర్థలు రావడం కోలీవుడ్​లో కలకలం రేపుతోంది. ముఖ్యంగా విజయ్ ఒక నటితో సన్నిహితంగా ఉంటున్నారని, అదే తమ విడాకులకు ప్రధాన కారణమని సంగీత ఆరోపించినట్లు తెలుస్తోంది. ఈ గొడవల మధ్య వారి పిల్లలు కూడా మానసిక వేదనకు గురవుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఆయన కొడుకు చేసిన పని ప్రస్తుతం హాట్​టాపిక్‌గా మారింది.

విజయ్, సంగీత దంపతులకు 25 ఏళ్ల కొడుకు జేసన్ సంజయ్, 20 ఏళ్ల కూతురు దివ్య సాషా ఉన్నారు. సాధారణంగా జేసన్ సంజయ్ వివాదాలకు దూరంగా ఉంటూ తన పని తాను చేసుకుపోతుంటారు. అయితే ఇటీవల తన తండ్రి విజయ్ ను ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. కుటుంబంలో జరుగుతున్న గొడవలపై తన నిరసనను ఇలా మౌనంగా వ్యక్తం చేస్తున్నాడని, తల్లికి అన్యాయం జరుగుతుందనే ఉద్దేశంతోనే సంజయ్ తండ్రికి దూరంగా ఉంటున్నట్లు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ విజయ్ వారసుడు సంజయ్ వెండితెరకు దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. యువ హీరో సందీప్ కిషన్ కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘సిగ్మా’ కు సంజయ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని త్వరలోనే విడుదలకు సిద్ధమవుతోంది. తన కెరీర్‌లో అత్యంత కీలకమైన ఈ సమయంలో, కుటుంబంలో ఇలాంటి విషాదకర లేదా ఊహించని ఘటనలు చోటుచేసుకోవడం సంజయ్‌కు మరియు ఆయన కుటుంబానికి పెద్ద షాక్ అనే చెప్పాలి. ఈ పరిణామం ఎన్నికల వేళ విజయ్ అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది.

మరిన్ని వీడియోల కోసం :

రేపే విజయ్, రష్మికల రిసెప్షన్.. కట్టు దిట్టమైన భద్రతా ఏర్పాట్లు!

ఇంద్ర భవనమే.. సొంత ఊర్లో విజయ్ దేవరకొండ ఫామ్ హౌజ్ చూశారా?

అట్లీ సినిమాలో నాలుగు రోల్స్‌లో అల్లు అర్జున్

మరోసారి స్క్రీన్ మీదకు టిక్కెట్ రేట్ల కహానీ

Follow Us