చాలా ఏళ్లుగా బిగ్ హిట్ కోసం ఎదురుచూస్తున్న ఆమిర్‌ఖాన్

Updated on: May 24, 2026 | 1:32 PM

బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ వరుస పరాజయాల తర్వాత తన కెరీర్‌ను విశ్లేషిస్తున్నారు. కమర్షియల్, కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాలు వర్కౌట్ కాకపోవడంతో, ఆయన కొత్త ప్రమోషన్ ట్రెండ్‌లను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియా ప్రభావం, ప్రచార విధానాల్లో వచ్చిన మార్పులు తనకు తెలియడం లేదని ఆమిర్ ఒప్పుకున్నారు.

బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ గత కొన్నేళ్లుగా వరుస ఫెయిల్యూర్స్‌ను ఎదుర్కొంటున్నారు. దీనితో ఆయన తన చిత్రాల వైఫల్యాలకు గల కారణాలను విశ్లేషించే పనిలో పడ్డారు. కమర్షియల్ సినిమాలు, రీమేక్‌లు, కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాలు ఏవి కూడా ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవడం ఆమిర్‌ను కలవరపెడుతోంది.అమిర్ ఖాన్ బ్యానర్ లో తెరకెక్కిన ఎగ్దిన్ సినిమా డిజాస్టర్ అవ్వడం, సాయి పల్లవి బాలీవుడ్ డెబ్యూతో పాటు ఆమిర్ తనయుడు హీరోగా నటించినప్పటికీ కనీస ఓపెనింగ్స్ కూడా రాకపోవడంతో ఆయన లోతైన విశ్లేషణలో పడ్డారు. భారీ బడ్జెట్‌తో నిర్మించిన థగ్స్ ఆఫ్ హిందుస్తాన్, డ్రీమ్ ప్రాజెక్ట్ లాల్ సింగ్ చద్దా, లాంగ్ గ్యాప్ తర్వాత చేసిన సితారే జమీన్ పర్ వంటి చిత్రాలు కూడా ఆమిర్‌కు విజయాన్ని అందించలేకపోయాయి.

Follow Us