ఛీ.. ఛీ.. మీరేం మనుషులురా.. జూనియర్ విద్యార్థిని బార్‌కు తీసుకెళ్లి..

Updated on: Sep 22, 2025 | 11:30 AM

మేడ్చల్‌ నారపల్లిలో ఇంజినీరింగ్ విద్యార్థి సాయితేజ ఆత్మహత్య చేసుకున్నాడు. హాస్టల్‌లో ఉరి వేసుకోవడం కలకలం రేపుతోంది. సాయితేజ ఆత్మహత్యకు సీనియర్ల వేధింపులే కారణమని అతని స్నేహితులు ఆరోపిస్తున్నారు. సీనియర్లు బలవంతంగా మద్యం తాగించి, ఒక బార్‌‌లో 10 వేల బిల్లు కట్టాలని ఒత్తిడి చేశారని చెబుతున్నారు..

మేడ్చల్‌ నారపల్లిలో ఇంజినీరింగ్ విద్యార్థి సాయితేజ ఆత్మహత్య చేసుకున్నాడు. హాస్టల్‌లో ఉరి వేసుకోవడం కలకలం రేపుతోంది. సాయితేజ ఆత్మహత్యకు సీనియర్ల వేధింపులే కారణమని అతని స్నేహితులు ఆరోపిస్తున్నారు. సీనియర్లు బలవంతంగా మద్యం తాగించి, ఒక బార్‌‌లో 10 వేల బిల్లు కట్టాలని ఒత్తిడి చేశారని చెబుతున్నారు. ఆ వేధింపులతోనే సాయితేజ ఆత్మహత్య చేసుకున్నాడని చెబుతున్నారు. ఆత్మహత్యకు ముందు తల్లిదండ్రులకు సెల్ఫీ వీడియో పంపించాడు సాయితేజ.

సాయి తేజది ఆత్మహత్య కాదు హత్యేనని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తమ కుమారుడిని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని సాయితేజ తండ్రి ప్రేమ్ సింగ్ ఆరోపిస్తున్నారు. సాయితేజ మృతిపై తమకు అనుమానాలు ఉన్నాయని బంధువులు చెబుతున్నారు. సాయితేజది ఆత్మహత్య కాదని చెబుతున్నారు. కాగా.. ఘటన సంచలనంగా మారింది.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి..

Viral Video: కొండ చిలువ తిరగబడితే ఎలా ఉంటుందో చూశారా..? ధైర్యముంటేనే వీడియో చూడండి..

Andhra: ఇంత వైలెంట్‌గా ఉన్నారేంటి మేడమ్.. వీఆర్వోతో గుంజీలు తీయించిన లేడీ ఆఫీసర్‌.. ఎందుకో తెలుసా..?

ముక్కులోని వెంట్రుకలు కట్ చేస్తున్నారా..? అయితే, మీ ఊపిరితిత్తులు హాంఫట్..

Published on: Sep 22, 2025 10:53 AM