Watch Video: నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న శునకం.. షాక్‎కు గురైన భక్తులు..

| Edited By: Srikar T

Jun 07, 2024 | 12:05 PM

ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లిలో అద్భుత ఘట్టం చోటుచేసుకుంది. గురువారం శని జయంతి సందర్భంగా గ్రామంలోని గీత మందిరంలో ఉన్న నవ గ్రహాల వద్ద ఓ శుకనం 11 ప్రదక్షిణలు చేయడం అందరిని ఆశ్చర్య పరిచింది. మాములుగా అయితే శని జయంతి సందర్భంగా భక్తులు ఆలయంలోని నవ గ్రహాల చుట్టూ భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు చేస్తారు. నవ గ్రహ దోషాలు తొలగిపోవాలని 9, 11 సార్లు ప్రదక్షిణలు చేస్తూ, నవధాన్యాలు దానం సమర్పించడం, కొబ్బరికాయలు కొట్టడం మామూలుగా జరుగుతూ ఉంటుంది.

ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లిలో అద్భుత ఘట్టం చోటుచేసుకుంది. గురువారం శని జయంతి సందర్భంగా గ్రామంలోని గీత మందిరంలో ఉన్న నవ గ్రహాల వద్ద ఓ శుకనం 11 ప్రదక్షిణలు చేయడం అందరిని ఆశ్చర్య పరిచింది. మాములుగా అయితే శని జయంతి సందర్భంగా భక్తులు ఆలయంలోని నవ గ్రహాల చుట్టూ భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు చేస్తారు. నవ గ్రహ దోషాలు తొలగిపోవాలని 9, 11 సార్లు ప్రదక్షిణలు చేస్తూ, నవధాన్యాలు దానం సమర్పించడం, కొబ్బరికాయలు కొట్టడం మామూలుగా జరుగుతూ ఉంటుంది. అయితే మందిరంలో ఉన్న నవగ్రహాల చుట్టూ భక్తులు ప్రదక్షిణలు చేస్తున్న సమయంలో ఒక శునకం వచ్చి ఇలా నవ గ్రహాల చుట్టూ తిరగడం ప్రారంభించింది. అక్కడ ఉన్న భక్తులు పక్కకు జరిగి శునకానికి దూరంగా వెళ్లిపోయారు. అదే క్రమంలో ఆ శునకం నవ గ్రహాల చుట్టూ తిరుగుతూ భక్తిని చాటుకుంది. దీంతో అక్కడ ఉన్న భక్తులు సర్వత్రా ఆసక్తిని కలిగించింది. అక్కడ ఉన్న భక్తులు వెంటనే తమ మొబైల్ ఫోన్లో వీడియోలు, ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ఇప్పుడు తెగ వైరల్‎గా మారిపోయింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow us on