Cow Birthday: ఆవుకు ఘనంగా జన్మదిన వేడుకలు.. పాల్గొన్న స్థానికులు

| Edited By: Subhash Goud

Aug 14, 2024 | 3:45 PM

నోరు లేని మూగ జీవికి కూడా బర్త్‌డే వేడుకలు నిర్వహించి, అందరి చేత శభాష్ అనిపించుకుంటున్నారు ఆ దంపతులు. అందరి మధ్య ఈ వేడుకను ఘనంగా నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ కు చెందిన మాజీ జెడ్పిటిసి సభ్యుడు ఐల రమేష్ రాధా దంపతులు గత రెండేళ్లుగా తమ ఇంట్లో ఒక అవును పెంచుకుంటున్నారు. అయితే శుక్రవారం రోజున ఆవును తీసుకురావడంతో..

Cow Birthday: ఆవుకు ఘనంగా జన్మదిన వేడుకలు.. పాల్గొన్న స్థానికులు
Cow
Follow us on

నోరు లేని మూగ జీవికి కూడా బర్త్‌డే వేడుకలు నిర్వహించి, అందరి చేత శభాష్ అనిపించుకుంటున్నారు ఆ దంపతులు. అందరి మధ్య ఈ వేడుకను ఘనంగా నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ కు చెందిన మాజీ జెడ్పిటిసి సభ్యుడు ఐల రమేష్ రాధా దంపతులు గత రెండేళ్లుగా తమ ఇంట్లో ఒక అవును పెంచుకుంటున్నారు. అయితే శుక్రవారం రోజున ఆవును తీసుకురావడంతో దానికి లక్ష్మి అని పేరు పెట్టారు. రెండు సంవత్సరాలు పూర్తి కావడంతో రెండవ బర్త్‌డే వేడుకలు తమ ఇంట్లోని ఒక వ్యక్తికి ఎలా నిర్వహిస్తారో, అదే విధంగా గోమాతకు పుట్టిన రోజు నిర్వహించారు. శుభ్రంగా స్నానం చేయించి, మెడలో పూలమాలవేసి శాలువా కప్పి, బొట్టుపెట్టి, కేక్ కట్ చేసి, ఆవుకు తినిపించారు.

అంతేకాదు ఇరుగుపొరుగు వారిని పిలిచి స్వీట్లు పంపిణీ చేసి, వారికి కూల్‌ డ్రింక్స్‌ కూడా అందించారు. ఇంట్లో కుటుంబ సభ్యుల వలె ఈ అవును పెంచుకుంటున్నారు. ఆవుకు ప్రతిరోజు ఉదయం బ్రేక్‌ ఫాస్ట్‌ 12 ఇడ్లీలు పెడతారు. మధ్యాహ్నం చపాతి కూడా తినిపిస్తారు. ఆవు తిన్న తర్వాతే, వారు బ్రేక్ ఫాస్ట్ చేస్తారు. ఆ కుటుంబంలో గోమాత కూడా తమ కుటుంబ సభ్యుల్లో ఒకరని అంటున్నారు. ఈ ఆవు తమ ఇంటికి వచ్చిన తర్వాతే అష్టైశ్వర్యాలు కలిసి వచ్చాయని, అందుకే తమ ఇంట్లో ఒక మెంబర్ లాగా చూసుకుంటున్నామని అంటున్నారు ఆ దంపతులు.