అక్టోబరు నెలలో జరిగా భారీ మార్పులు ఇవే!
అక్టోబర్ 1 నుంచి సామాన్యుల ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన పలు కీలక మార్పులు అమల్లోకి వచ్చాయి. ఎస్‌బీఐ సాలరీ ఖాతాదారులకు ఇతర బ్యాంకుల ఏటీఎంలలో ఉచిత లావాదేవీలు 10 నుంచి 5కు తగ్గాయి. సబ్సిడీ ఎల్‌పీజీకి ఆధార్ బయోమెట్రిక్ ఇ-కేవైసీ అవసరం కాగా, రూ.3 కోట్లకు పైబడిన బల్క్ డిపాజిట్లపై కొత్త వడ్డీ రేటు వెల్లడింపు నిబంధనలు వచ్చాయి. 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర కూడా రూ.62.50 పెరిగింది.
ప్రతి నెలా మాదిరిగానే అక్టోబరు 1 నుంచి సామాన్యుడి జేబుపై ప్రభావం చూపే పలు కీలక ఆర్థిక, వ్యూహాత్మక నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ఎస్‌బీఐ ఏటీఎం పరిమితులు, ఎల్‌పీజీ ఇ-కేవైసీ, యూపీఐ ఛార్జీలు, ఎఫ్‌డీ రూల్స్‌తో పాటు గ్యాస్ ధరల్లోనూ ముఖ్యమైన మార్పులు చోటుచేసుకున్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ సాలరీ ఖాతాదారులకు షాక్ ఇచ్చింది. ఇతర బ్యాంకుల ఏటీఎంల ద్వారా జరిపే నెలవారీ ఉచిత లావాదేవీల పరిమితిని 10 నుంచి 5 సార్లకు తగ్గించింది. అయితే, ఎస్‌బీఐ సొంత ఏటీఎంలలో చేసే లావాదేవీలపై ఎలాంటి పరిమితులు ఉండవు. గ్యాస్ రాయితీ దుర్వినియోగాన్ని అడ్డుకునేందుకు చేపట్టిన బయోమెట్రిక్ ఆధార్ ఇ-కేవైసీ గడువు ముగిసింది. ఇ-కేవైసీ పూర్తి చేయని వినియోగదారులకు ఇకపై సబ్సిడీ లభించదు; వారు సిలిండర్‌ను మార్కెట్ ధరకే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అక్టోబర్ 15 నుంచి రూ. 2,000 పైబడిన యూపీఐ వ్యాపార చెల్లింపులపై 0.4% మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) వర్తించనుంది. సాధారణ వ్యక్తుల మధ్య జరిగే చెల్లింపులు, చిరు వ్యాపారులకు దీని నుంచి మినహాయింపు ఉంది. పెట్రోల్ పంపులు, ఇన్సూరెన్స్ లాంటి సేవలకు ఫ్లాట్‌గా రూ. 5 ఛార్జీ పడుతుంది. రూ. 3 కోట్లు అంతకంటే ఎక్కువ మొత్తం ఉన్న బల్క్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను బ్యాంకులు ప్రతిరోజు ఉదయం 10 గంటలకల్లా తమ వెబ్‌సైట్లలో ప్రచురించాలని ఆర్బీఐ ఆదేశించింది. వినియోగదారుల మధ్య ఎలాంటి వివక్ష చూపకూడదని స్పష్టం చేసింది. అక్టోబర్ 5 నుంచి 7 వరకు ఆర్‌బీఐ ద్రవ్య విధాన కమిటీ సమావేశం కానుంది. ప్రస్తుతం 5.25% వద్ద ఉన్న రెపో రేటుపై అక్టోబర్ 7న తుది నిర్ణయం వెలువడనుంది. గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ, 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధరపై ఆయిల్ కంపెనీలు రూ. 62.50 మేర పెంచాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
దుబాయ్ ఫ్లైట్ లో కత్తిపోట్లు..విమానంలో అసలేం జరిగింది?ప్రాణాలకు తెగించి పోరాడిన కెప్టెన్
Rama Nandana: అమ్మో.. ఆ రోజును అస్సలు మరచిపోలేను
ఏపీ సర్కార్ బంపర్ ఆఫర్.. రూ.35కే కిలో ఉల్లిగడ్డలు.. ఆధార్ ఉంటే చాలు!
Rabi Crops: రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్.. రబీ పంటలకు కనీస మద్దతు ధర పెంపు!
45 లక్షల కట్నం, బంగారం ఇచ్చినా తీరని దాహం.. వరకట్న వేధింపులకు నవవధువు బలి
