Cheque Book New Rules: చెక్ బుక్‌లపై కొత్త రూల్స్.. మీ పాత చెక్ ఇక చెల్లదా?

Updated on: Aug 24, 2026 | 5:33 PM

చెక్కులతో లావాదేవీలు చేసే ఖాతాదారులు తమ చెక్‌బుక్‌ను ఒకసారి పరిశీలించుకోవాలి. మోసాలను అరికట్టేందుకు కొన్ని బ్యాంకులు కొత్త చెక్‌బుక్‌లలో అక్షరాలు, అంకెలతో కూడిన ఆల్ఫాన్యూమరిక్ కోడ్‌ను ప్రవేశపెడుతున్నాయి. చెక్కుల ధ్రువీకరణ, క్లియరింగ్‌లో ఈ కోడ్ ఉపయోగపడుతుంది. అయితే పాత చెక్‌బుక్‌లకు డిసెంబర్ 31 గడువు అన్నది అన్ని బ్యాంకులకు వర్తించే ఆర్‌బీఐ అధికారిక నిబంధన కాదని గుర్తుంచుకోవాలి.

ఇప్పటికీ బ్యాంకింగ్ లావాదేవీల కోసం చెక్కులను వాడుతున్నారా? అయితే మీ చెక్ బుక్‌లో కొత్త భద్రతా ఫీచర్లు ఉన్నాయో లేదో ఒకసారి సరిచూసుకోవడం చాలా ముఖ్యం. చెక్ మోసాలను అరికట్టి, లావాదేవీల భద్రతను పెంచే లక్ష్యంతో బ్యాంకులు సరికొత్త చెక్ బుక్‌లను జారీ చేస్తున్నాయి. వీటిలో ‘ఆల్ఫాన్యూమరిక్ కోడ్’ అనే ప్రత్యేకమైన భద్రతా ఫీచర్‌ను బ్యాంకులు ప్రవేశపెడుతున్నాయి. ఇటీవల బ్యాంక్ ఆఫ్ ఇండియా వంటి పలు బ్యాంకులు తమ చెక్కులపై అక్షరాలు, అంకెల కలయికతో ఉండే ఈ కోడ్‌ను తీసుకువచ్చాయి. పాత చెక్ బుక్‌ల స్థానంలో ఈ కొత్త సిరీస్ చెక్ బుక్‌లను తీసుకోవాలని ఖాతాదారులకు సూచిస్తున్నాయి. ఈ కోడ్ ద్వారా చెక్కుల క్లియరింగ్ సమయంలో సులభంగా గుర్తించి, ధ్రువీకరించడానికి వీలవుతుంది. దీనిద్వారా నకిలీ లేదా ట్యాంపరింగ్ చేసిన చెక్కులతో జరిగే మోసాలకు అడ్డుకట్ట వేయవచ్చని భావిస్తున్నాయి. అలాగే ఆర్‌బీఐ అమలు చేస్తున్న ‘చెక్ ట్రంకేషన్ సిస్టమ్’ ద్వారా ఎలక్ట్రానిక్ ఇమేజ్ రూపంలో క్లియరింగ్ వేగవంతంగా జరుగుతోంది. కొన్ని రకాల పాత చెక్కులకు డిసెంబర్ 31 గడువు అంటూ నివేదికలు వస్తున్నాయి. అయితే, ఇది అన్ని బ్యాంకులకు వర్తించే ఆర్‌బీఐ అధికారిక గడువు కాదని వినియోగదారులు గమనించాలి. ప్రతి బ్యాంకుకూ సొంత నిబంధనలు ఉంటాయి కాబట్టి, మీ పాత చెక్ బుక్ చెల్లుబాటుపై మీ బ్యాంకును సంప్రదించడం మంచిది. ముఖ్యంగా వ్యాపార లావాదేవీలు నిర్వహించేవారు బ్యాంక్ సూచనలు తప్పక పాటించాలి. అవసరమైతే చెక్‌బుక్‌ను మార్చి కొత్త చెక్ బుక్‌ను పొందడం మంచిది. డిజిటల్ చెల్లింపులు పెరిగినప్పటికీ, లావాదేవీలకు పక్కా రికార్డు ఉండటం కోసం చాలామంది ఇప్పటికీ చెక్కులనే వినియోగిస్తున్నారు. చెక్కు రాసిన తేదీ నుంచి మూడు నెలల వరకు మాత్రమే అది చెల్లుబాటు అవుతుంది. చెక్ బౌన్స్ అయితే ‘నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్’ ప్రకారం చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి చెక్ లావాదేవీల విషయంలో ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

దారుణం.. మహిళను చంపి బిర్యానీ వండి..

Loading...
Unable to load recommendations.
Follow Us