భోజనం చేసిన తర్వాత కాఫీ, టీ తాగుతున్నారా ?? అయితే ఈ సమస్యలు తప్పవు బాస్

Updated on: Mar 04, 2026 | 5:04 PM

భోజనం చేసిన వెంటనే టీ లేదా కాఫీ తాగడం ఆరోగ్యానికి హానికరం. టీలోని టానిన్లు ఐరన్ శోషణను అడ్డుకుంటాయి, రక్తహీనతకు దారితీస్తాయి. కెఫిన్ జీర్ణ సమస్యలు, గుండెల్లో మంట, నిద్రలేమిని కలిగిస్తుంది. ప్రోటీన్ జీర్ణం కాక ఉబ్బరం వస్తుంది. ఈ దుష్ప్రభావాలను నివారించడానికి భోజనం తర్వాత కనీసం 45-60 నిమిషాలు వేచి ఉండాలి. ఇది ఆహారంలోని పోషకాలను శరీరం గ్రహించడానికి సహాయపడుతుంది.

చాలా మందికి మధ్యాహ్న భోజనం లేదా రాత్రి భోజనం తర్వాత వేడి వేడి టీ లేదా కాఫీ తాగే అలవాటు ఉంటుంది. కొందరు ఇది జీర్ణక్రియకు సహాయపడుతుందని నమ్ముతారు. అయితే నిపుణుల ప్రకారం ఈ అలవాటు ఆరోగ్యానికి ప్రమాదకరం అంటున్నారు నిపుణులు. టీలో ‘టానిన్’ అనే పదార్థం ఉంటుంది. ఈ పదార్థాలు ఆహారంలోని ఐరన్‌తో కలిసిపోతాయి. దీని కారణంగా శరీరం ఆహారంలోని ఐరన్‌ను గ్రహించలేకపోతుంది. ప్రతిరోజూ భోజనం చేసిన వెంటనే టీ తాగితే, అది శరీరంలో ఇనుము లోపానికి కారణమవుతుంది. రక్తహీనతకు దారితీస్తుంది. ఇది ముఖ్యంగా శాఖాహారులకు హానికరం. టీ, కాఫీలలో ఉండే కెఫిన్ కడుపులో ఆమ్ల పరిమాణాన్ని పెంచుతుంది. భోజనం చేసిన వెంటనే టీ తాగడం వల్ల గుండెల్లో మంట వస్తుంది. టీలో ఉండే థియోఫిలిన్ అనే పదార్థం మలబద్ధకానికి కారణమవుతుంది. ఆహారంలోని ప్రోటీన్లు జీర్ణం కావడం కష్టమవుతుంది. దీనివల్ల ఉబ్బరం వస్తుంది. భోజనం చేసిన వెంటనే కాఫీ తాగడం వల్ల రక్త ప్రసరణ పెరుగుతుంది. ఇది తాత్కాలికంగా అధిక రక్తపోటును పెంచుతుంది. అలాగే రాత్రి భోజనం తర్వాత టీ లేదా కాఫీ తాగడం వల్ల అందులోని కెఫిన్ వల్ల మీకు నిద్రలేమి వస్తుంది. ఇది మరుసటి రోజు మీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం మీరు టీ లేదా కాఫీని నివారించలేకపోతే భోజనం తర్వాత కనీసం 45 నిమిషాల నుంచి 1 గంట తర్వాత దీనిని తీసుకోవాలి. ఇది శరీరానికి ఆహారంలోని పోషకాలను గ్రహించడానికి తగినంత సమయం ఇస్తుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆ గ్రామానికీ.. ఆ పక్షులకీ మధ్య.. శతాబ్దాలుగా విడదీయరాని బంధం

ఈ రెండిటి తో.. మెరిసే చర్మం మీ సొంతం.. ముసలి వాళ్ళు కూడా యవ్వనంగా మారాల్సిందే

Follow Us