శ్రీశైలంలో మహా కుంభాభిషేకం నిర్వహణ.. భక్తుల ప్రత్యేక పూజలు..

| Edited By: Srikar T

Feb 20, 2024 | 9:03 PM

శ్రీశైలం మహా పుణ్యక్షేత్రంలో మహా కుంభాభిషేకం వేడుకలను దేవస్థానం వైభవంగా నిర్వహిస్తుంది. లోక కళ్యాణం, ప్రజా సంక్షేమం కోసం చేపట్టిన మహా కుంభాభిషేక మహోత్సవ క్రతువులు ఐదవ రోజుకు చేరుకున్నాయి. ఉదయం శాస్త్రబద్ధంగా పూజల క్రతువులు నిర్వహించారు. సాయంత్రం ప్రత్యేక పూజలు చేశారు. మహాకుంభాభిషేకానికి పురస్కరించుకొని స్వామి అమ్మ వాళ్లకు ప్రతిరోజు విశేష పూజలు, దేవతా హవనములు, దేవా హవనములు, జపాలు పారాయణాలు నిర్వహిస్తున్నారు.

చివరి రోజు 21వ తేదీన జరిగే మహా కుంభాభిషేకం మహోత్సవంలో కంచి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి స్వామి, శ్రీశైలం జగద్గురు పీఠాధిపతి చిన్న సిద్ధ రామ పండితారాధ్య శివచార్య మహా స్వామీజీ. పుష్పగిరి పీఠాధిపతి విద్యా శంకర భారతితో పాటు దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డితో పాటు పలువురు ప్రముఖులు పాల్గొననున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow us on