Telangana weather: తెలంగాణాలో మరో 5 రోజులు కుండపోత వర్షాలే..! ఎక్కడెక్కడ అంటే..?

|

Sep 07, 2023 | 9:14 PM

తెలంగాణను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. తాజాగా హైదరాబాద్ వాతావరణ కేంద్రం మరోసారి హెచ్చరిక జారీ చేసింది. వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని, దీంతోపాటు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడిందని వెల్లడించింది. మరో ఐదు రోజుల పాటు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది. పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.

తెలంగాణను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. తాజాగా హైదరాబాద్ వాతావరణ కేంద్రం మరోసారి హెచ్చరిక జారీ చేసింది. వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని, దీంతోపాటు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడిందని వెల్లడించింది. మరో ఐదు రోజుల పాటు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది. పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. సెప్టెంబర్ 6న పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలులతో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఖమ్మం, ములుగు, నల్గొండ, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ వర్షాకాలంలో 20 శాతం అధిక వర్షపాతం నమోదయిందని వాతావరణశాఖ తెలిపింది. జూన్ 1 నుంచి సెప్టెంబర్ 5 వరకు రాష్ట్ర సగటు వర్షపాతం 603.2 మిల్లి మీటర్లు కాగా.. ఇప్పటి వరకు 723.1 మిల్లి మీటర్ల వర్షపాతం నమోదయిందని వాతావరణ శాఖ వెల్లడించింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..