Tillu Square: నాకు ఏడుపు వస్తోంది.. ఎమోషనల్ అయిన రాధిక..

|

Apr 08, 2024 | 9:13 PM

సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన టిల్లు స్క్వేర్‌ మూవీ భారీ విజయాన్ని అందుకొని రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరిన విషయం తెలిసిందే. భారీ విజయాన్ని అందుకున్న నేపథ్యంలో చిత్ర యూనిట్‌ సోమవారం సక్సెస్‌ మీట్‌ను నిర్వహించింది. ఈ సందర్భంగా ఈవెంట్‌లో పాల్గొన్ని నటి నేహా శెట్టి ఎమోషనల్ అయ్యింది. తనకు ఈ అవకాశం ఇచ్చి చిత్ర యూనిట్‌కు కృతజ్ఞతలు తెలిపిన నేహా..

సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన టిల్లు స్క్వేర్‌ మూవీ భారీ విజయాన్ని అందుకొని రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరిన విషయం తెలిసిందే. భారీ విజయాన్ని అందుకున్న నేపథ్యంలో చిత్ర యూనిట్‌ సోమవారం సక్సెస్‌ మీట్‌ను నిర్వహించింది. ఈ సందర్భంగా ఈవెంట్‌లో పాల్గొన్ని నటి నేహా శెట్టి ఎమోషనల్ అయ్యింది. తనకు ఈ అవకాశం ఇచ్చి చిత్ర యూనిట్‌కు కృతజ్ఞతలు తెలిపిన నేహా.. అభిమానుల రెస్పాన్స్‌కు ఎమోషన్‌ అయ్యింది. అభిమానుల అరుస్తుంటే తనకు ఏడుపోస్తుందంటూ ఎమోషనల్‌ అయ్యిందీ బ్యూటీ.  నాకు ఇంత ప్రేమ ఇచ్చినందకు ధన్యవాదాలు అని చెప్పుకొచ్చింది. డీజే టిల్లు సమయంలో కూడా తనపై అభిమానం చూపారి చెప్పుకొచ్చింది. ఇక తనకు రాధిక పాత్రను ఇచ్చినందుకు హీరో సిద్ధూతో పాటు, దర్శకుడు, నిర్మాతకు నేహా శెట్టి శుభాకాంక్షలు తెలిపింది. తన చేతులో మైక్‌ లేకుంటే తాను కూడా అభిమానుల్లాగానే కేరింతలు కొట్టేదాన్ని అని చెప్పుకొచ్చిందీ బ్యూటీ. టిల్లు క్యూబ్‌ మూవీలో త్వరలోనే కలుద్దామంటూ చెప్పుకొచ్చింది..

Follow us on