Telangana: 200 ఏళ్ల నుంచి అక్కడ ఉన్న నంది ఏమైంది..? సీసీ కెమెరాలు ఉన్నా..

Updated on: Oct 29, 2026 | 4:37 PM

నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం కుడికిల్ల గ్రామంలోని శివాలయంలో సుమారు 200 ఏళ్ల చరిత్ర కలిగిన పురాతన నంది విగ్రహం చోరీకి గురైంది. విగ్రహం కింద గుప్తనిధులు ఉంటాయనే అనుమానంతోనే దుండగులు ఈ చోరీకి పాల్పడి ఉంటారని గ్రామస్తులు భావిస్తున్నారు.

నాగర్ కర్నూల్ జిల్లాలో పురాతన ఆలయంలో నంది విగ్రహం చోరీకి గురైన ఘటన కలకలం రేపుతోంది. కొల్లాపూర్ మండలం కుడికిల్ల గ్రామంలోని శివాలయంలో సుమారు 200 ఏళ్ల చరిత్ర కలిగిన పురాతన నంది విగ్రహాన్ని గుర్తుతెలియని దుండగులు ఎత్తుకెళ్లారు. విగ్రహం కింద గుప్తనిధులు ఉంటాయనే అనుమానంతోనే ఈ చోరీకి పాల్పడి ఉంటారని గ్రామస్తులు భావిస్తున్నారు.

గ్రామస్తుల కథనం ప్రకారం.. ఆలయంలోని పురాతన నంది విగ్రహాన్ని లక్ష్యంగా చేసుకున్న దుండగులు పక్కా ప్రణాళికతో చోరీకి పాల్పడినట్లు తెలుస్తోంది. ఆలయంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను కిందికి దించి, వాటి నిఘా నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించినట్లు సమాచారం. దీంతో ఈ ఘటన వెనుక ముందస్తు ప్రణాళిక ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

పురాతన విగ్రహం మాయమవడంతో గ్రామంలో ఆందోళన నెలకొంది. విగ్రహం కింద గుప్తనిధులు ఉన్నాయనే నమ్మకంతోనే దుండగులు ఈ పని చేసి ఉంటారని స్థానికులు అనుమానిస్తున్నారు. అయితే, చోరీకి గుప్తనిధుల అంశమే కారణమా అన్నది ఇంకా నిర్ధారణ కాలేదు.

స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు పరిశీలన చేపట్టి దర్యాప్తు ప్రారంభించారు. సీసీ కెమెరాలను కిందికి దించిన అంశంతో పాటు, దొంగలు ఆలయంలోకి ఎలా ప్రవేశించారు, విగ్రహాన్ని ఎలా తరలించారనే కోణాల్లో విచారణ జరుపుతున్నట్లు తెలుస్తోంది. పురాతన నంది విగ్రహం ఆచూకీ కనుగొని నిందితులను పట్టుకునేందుకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

 

Published on: Oct 29, 2026 03:47 PM
Loading...
Unable to load recommendations.
Follow Us