ఆ ఊరంతా కవలలే.. ఏంటా రహస్యం..!

ట్విన్స్ గ్రామంగా పాతదొడ్డుగుంట ప్రాంతానికి ఆంధ్రప్రదేశ్‌లో ఓ ప్రత్యేకమైన స్థానం ఉంది. 2006 సర్వే ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా పన్నెండున్నర కోట్ల మంది కవల పిల్లలున్నారు. ఇది ప్రపంచ జనాభాలో 1.9 శాతం. ఈ మొత్తం కవలపిల్లల్లో 10 మిలియన్ల మంది మోనో జైగోటిక్ కవలలుగా, మిగతావారు జైగోటిక్ కవలలు అంటారు. కాగా.. ప్రస్తుతం పాతదొడ్డిగుంట గ్రామానికి కూడా ‘కవల ఊరు’ అనే పేరొచ్చింది. అసలు ఈ గ్రామానికి ఎందుకా పేరు వచ్చింది..? దొడ్డుగుంటలోని ఆ బావి […]

ఆ ఊరంతా కవలలే.. ఏంటా రహస్యం..!
Follow us

| Edited By:

Updated on: Jul 08, 2019 | 8:48 AM

ట్విన్స్ గ్రామంగా పాతదొడ్డుగుంట ప్రాంతానికి ఆంధ్రప్రదేశ్‌లో ఓ ప్రత్యేకమైన స్థానం ఉంది. 2006 సర్వే ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా పన్నెండున్నర కోట్ల మంది కవల పిల్లలున్నారు. ఇది ప్రపంచ జనాభాలో 1.9 శాతం. ఈ మొత్తం కవలపిల్లల్లో 10 మిలియన్ల మంది మోనో జైగోటిక్ కవలలుగా, మిగతావారు జైగోటిక్ కవలలు అంటారు.

కాగా.. ప్రస్తుతం పాతదొడ్డిగుంట గ్రామానికి కూడా ‘కవల ఊరు’ అనే పేరొచ్చింది. అసలు ఈ గ్రామానికి ఎందుకా పేరు వచ్చింది..? దొడ్డుగుంటలోని ఆ బావి రహస్యమేంటి..? ఆ నీరు తాగితే కవల పిల్లలు పుడతారా..? ఆ బావి నీటిలో ఔషద గుణాలు పుష్కలంగా ఉన్నాయా అంటే..? అవును ఇది నిజమే అంటున్నారు ఆ గ్రామస్తులు. గత 25 ఏళ్లుగా ఇదే.. అక్కడి ప్రజలు నమ్ముతున్న నమ్మకం. తాతల కాలం నాటి ఆ బావిలోని నీరు తాగితే కవల పిల్లలు పుడతారట. ఆ బావి నీటి కోసం ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తారని ఆ  ఊరి ప్రజలు అంటున్నారు. హైదరాబాద్, విజయవాడ ప్రాంతాల నుంచి వచ్చి నీటిని తీసుకెళ్తున్నారని గ్రామస్తులు చెబుతున్నారు.