Viral Video: రోడ్డుపై రీల్ చేద్దామనుకున్నారు.. ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు..

|

Aug 15, 2024 | 4:10 PM

రోడ్డుపై వెళ్లేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్లాలని చెబుతూ ఉంటారు. కానీ ఎవరూ ఇప్పుడు పట్టించుకోవడం లేదు. ఈ మధ్య కాలంలో రోడ్డు ప్రమాదాలు చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. తెలిసీ తెలియక యువకులు ప్రమాదాలను కొనితెచ్చుకుంటున్నారు. రీల్స్, వ్యూస్ కోసం.. తమ ప్రాణాలనే పోగొట్టుకుంటున్నారు. రోడ్ యాక్సిడెంట్లకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్..

Viral Video: రోడ్డుపై రీల్ చేద్దామనుకున్నారు.. ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు..
Viral Video (2)
Follow us on

రోడ్డుపై వెళ్లేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్లాలని చెబుతూ ఉంటారు. కానీ ఎవరూ ఇప్పుడు పట్టించుకోవడం లేదు. ఈ మధ్య కాలంలో రోడ్డు ప్రమాదాలు చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. తెలిసీ తెలియక యువకులు ప్రమాదాలను కొనితెచ్చుకుంటున్నారు. రీల్స్, వ్యూస్ కోసం.. తమ ప్రాణాలనే పోగొట్టుకుంటున్నారు. రోడ్ యాక్సిడెంట్లకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా అలాంటి వీడియోకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట హల్‌చల్ చేస్తుంది. రీల్ చేద్దామని రోడ్డుపై బైక్‌పై వెళ్తున్నారు. కట్ చేస్తే వేగంగా వచ్చి ఓ కారు ఢీ కొట్టింది.

ఉత్తర ప్రదేశ్‌లోని మీరట్ – పౌరీ హైవేపై ఇద్దరు యువకులు కలిసి బైక్ పై వెళ్తున్నారు. బైక్ పై వెళ్తూ డిఫరెంట్‌గా ఓ రీల్ చేద్దామనుకున్నారు. ముందు బైకులో ఇద్దరు వ్యక్తులు వెళ్తుండగా.. వారి వెనుక మరో ఇద్దరు బైక్‌పై వస్తున్నారు. వెనుక ఉన్నవారు.. వీడియో తీస్తున్నారు. రోడ్డుపై ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే బండిని సడెన్‌గా మరో వైపుకు మళ్లించారు. ఈ క్రమంలోనే వారి వెనుక స్పీడుగా వస్తున్న ఓ కారు.. బైకును ఢీ కొట్టింది. దీంతో ఇద్దరు యువకులు ఎగిరి గాల్లో పడ్డారు.

ఇది గమనించిన స్థానికులు వెంటనే గాయ పడ్డ యువకులను సమీప ఆస్పత్రికి తరలించి.. చికిత్స అందించారు. ఈ యువకులు ప్రాణాలతో బయట పడినా.. గాయాలు మాత్రం తీవ్రంగా తగిలినట్టు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసి నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. ‘రోడ్డు మీద ఇలాంటి పిచ్చి వేషాలు వేస్తే ఇలానే ఉంటుంది’.. ‘ఇలాంటి ప్రమాదకర విన్యాసాలను రోడ్డుపై చేయకూడదంటూ’ కామెంట్లు చేస్తున్నారు.