Viral Video: ఓరినాయనో.. సిగరెట్ వెలిగించుకోడానికి ఈ కారును ఎలా వాడాడో చూస్తే షాకే..

|

Aug 22, 2024 | 5:43 PM

సోషల్ మీడియాలో అనేక రకాలైన వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. వీటిల్లో కొన్ని చూస్తే మాత్రం చాలా చిత్రంగా ఉంటాయి. ఇలా కూడా ఉంటాయా.. ఇలా కూడా చేస్తారా? అని.. మరి మనుషులు ఏమన్నా తక్కువా.. ఏదైనా చేయగలరు. అంత వినూత్నంగా ఆలోచించడం మనుషులకే సాధ్యం. సాధారణంగా సిగరెట్‌ని ఎలా వెలిగించుకుంటారు. అగ్గి పెట్టె లేదంటే లైటర్‌తో. కానీ ఇక్కడ ఓ యువకుడు మాత్రం..

Viral Video: ఓరినాయనో.. సిగరెట్ వెలిగించుకోడానికి ఈ కారును ఎలా వాడాడో చూస్తే షాకే..
Viral Video (1)
Follow us on

సోషల్ మీడియాలో అనేక రకాలైన వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. వీటిల్లో కొన్ని చూస్తే మాత్రం చాలా చిత్రంగా ఉంటాయి. ఇలా కూడా ఉంటాయా.. ఇలా కూడా చేస్తారా? అని.. మరి మనుషులు ఏమన్నా తక్కువా.. ఏదైనా చేయగలరు. అంత వినూత్నంగా ఆలోచించడం మనుషులకే సాధ్యం. సాధారణంగా సిగరెట్‌ని ఎలా వెలిగించుకుంటారు. అగ్గి పెట్టె లేదంటే లైటర్‌తో. కానీ ఇక్కడ ఓ యువకుడు మాత్రం చాలా వెరైటీగా వెలిగించాడు. ఓ ఖరీదైన కారును చూడగానే ఇతనికి ఈ ఆలోచన వచ్చినట్టు ఉంది. ఓ లగ్జరీ కారు సహాయంతో సిగరెట్ వెలిగించుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఈ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో జోరుగా వైరల్ అవుతుంది. అదేంటో మీరు కూడా చూసేయండి.

ఈ వీడియోలో.. ఓ యువకుడికి పోర్స్చే లగ్జరీ కారు కనిపించింది. ఆ కారును చూడగానే సిగరెట్ వెలిగించడం మొదలు పెట్టాడు. దగ్గరగా సిగరెట్ పెట్టాడు. ఇంతలో కారు స్టార్ట్ అయ్యింది. దీంతో వెనుక నుంచి ఆ కారుకు మంటలు వచ్చాయి. ఈ మంటలతో సిగరెట్ అయితే వెలిగింది. కానీ ఈ క్రమంలోనే అతని చేయి కూడా కాలింది. దీంతో వెంటనే చేయి పట్టుకుని లబోదిబో అన్నాడు.

కాగా ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ‘సిగరెట్ ఇలా కూడా వెలిగించవచ్చా’.. ‘బాగా అయ్యింది.. ఇలా చేస్తే అలాగే ఉంటుంది’.. ‘అవసరమా.. కొత్తగా ట్రై చేస్తే ఇలాగే చేయి కాలుతుంది’.. ‘తిక్క కుదిరిందా?’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అలాగే వివిధ రకాల ఎమోజీలు కూడా పెడుతున్నారు.

వీడియో చూడండి