Viral News: టీవీ సీరియల్ యాడ్‌పై పోలీస్ ఆఫీసర్ గుస్సా.. ఇదేం పద్దతి అంటూ ట్విట్టర్ వేదికగా విమర్శలు..

|

Dec 07, 2020 | 4:08 PM

ఆయనొక పోలీసు ఉన్నతాధికారి.. ఆయనకు సమాజం పట్ల బాధ్యత తెలుసు.. ఏ విషయాన్ని ఎలా స్వీకరించాలనే విషయం ఇంకా బాగా..

Viral News: టీవీ సీరియల్ యాడ్‌పై పోలీస్ ఆఫీసర్ గుస్సా.. ఇదేం పద్దతి అంటూ ట్విట్టర్ వేదికగా విమర్శలు..
Follow us on

ఆయనొక పోలీసు ఉన్నతాధికారి.. ఆయనకు సమాజం పట్ల బాధ్యత తెలుసు.. ఏ విషయాన్ని ఎలా స్వీకరించాలనే విషయం ఇంకా బాగా తెలుసు. అలాంటి వ్యక్తికి డ్యాన్స్‌ని కించ పరుస్తూ ఉన్న ఓ సిరీయల్‌కు సంబంధించిన అడ్వర్టయిజ్‌మెంట్ పోస్టర్ కనిపించింది. వెంటనే ఆయనలో ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది. కానీ ఆ ఆగ్రహాన్ని బాహాటంగా ప్రదర్శించలేదు. ఆలోచనతో.. వివేచనతో సోషల్ మీడియా వేదికగా ఆ యాడ్‌పై స్ట్రాంగ్ కౌంటర్ వేశారు. ఇంతకీ ఆ యాడ్ ఏంటో.. అసలు సంగతేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఉత్తరప్రదేశ్‌కు చెందిన పోలీస్ ఆఫీసర్ రాహుల్ శ్రీవాత్సవ న్యూస్ పేపర్ చదువుతుండగా ఓ టీవీ సీరియల్‌కు సంబంధించిన యాడ్ కనిపించింది. ఆ యాడ్‌పై ‘ఓ డ్యాన్సర్‌ను మీ కోడలిగా అంగీకరిస్తారా?’ అనే కొటేషన్ రాసి ఉంది. అది చదవిన ఆయనకు అసలు ఈ సమాజం ఎటుపోతోందని ఆవేదన కలిగింది. వెంటనే ఆడ్వర్టయిజ్‌మెంట్ తాలూకు ఫోటోను ట్విట్టర్‌లో షేర్ చేశారు. యాడ్‌పై విమర్శలు గుప్పించారు. డ్యాన్స్ అనే పవిత్రమైన కళారూపాన్ని టీవీ సీరియల్స్ అపవిత్రం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. మనోహరమైన కళారూపం నృత్యం అని, దానిని అనైతికమైనదిగా చిత్రీకరించడం సరికాదన్నారు. ఇది పూర్తిగా పాతకాలపు అజ్ఞానానికి నిదర్శనంగా ఉంది అంటూ విమర్శలు గుప్పించారు. ఇప్పుడు ఈ ట్వీట్ తెగ వైరల్ అవుతోంది. మరి ఆ ట్వీట్‌ను మీరూ చూసేయండి..