Video: చీర కొంగును ఇంజిన్‌కు కట్టి .. ట్రైన్ ముందు మహిళ డ్యాన్స్! వీడియో వైరల్

వైరల్ అవుతున్న వీడియోలో ఓ మహిళ చీర, సన్‌గ్లాసెస్ ధరించి రైల్వే పట్టాలపై కనిపించింది. ఆమె ముందు ఓ రైలు నిలిచి ఉంది. ఇంతలో ఆమె తన చీర కొంగు చివరను రైలు ఇంజిన్‌కు కట్టింది. అనంతరం కొంత ముందుకు వెళ్లి కెమెరా వైపు చూస్తూ డ్యాన్స్ చేయడం ప్రారంభించింది. పాటకు లిప్‌సింక్ చేస్తూ.. చేతులతో సైగలు చేస్తూ డ్యాన్స్ చేసింది. ఆమె ముఖ కవళికలు, డ్యాన్స్ మూవ్‌మెంట్స్ అన్నీ ప్రత్యేకంగా ఉన్నాయి.

Video: చీర కొంగును ఇంజిన్‌కు కట్టి .. ట్రైన్ ముందు మహిళ డ్యాన్స్! వీడియో వైరల్
Woman Ties Saree To Train Engine Recreates Dance On Tracks

Updated on: Oct 02, 2026 | 7:10 PM

ఒకవైపు ఆగి ఉన్న రైలు.. మరోవైపు పట్టాలపై నిలబడి ఉన్న మహిళ.. ఆమె చేతిలో సెల్‌ఫోన్ కెమెరా.. చీర కొంగును ఏకంగా రైలు ఇంజిన్‌కు కట్టి ఆమె చేసిన డాన్స్‌ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారి తీవ్ర చర్చకు దారితీసింది. సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవ్వాలంటే.. కొన్ని లైక్స్, మరికొన్ని వ్యూస్ కోసం ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టాలా? వైరల్ అవుతున్న ఓ వీడియో ఈ ప్రశ్నలనే మరోసారి తెరపైకి తెచ్చింది.

లైక్స్ కోసం రిస్క్ అవసరమా?

వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ కావడంతో నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. రైలు పట్టాలపై నిలబడటం, రైలు ఇంజిన్‌కు చీర కొంగును కట్టడం వంటి చర్యలు ప్రమాదకరమని పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. ‘కొన్ని లైక్స్, వ్యూస్ కోసం ప్రజలు తమ భద్రతను మర్చిపోతున్నారు’ అంటూ పలువురు విమర్శించారు. ఈ వీడియోపై దర్యాప్తు చేసి రైల్వే అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని మరో నెటిజన్ కోరారు.

రైలు ఆగి ఉంది కదా అని నిర్లక్ష్యం చేయొద్దు!

వీడియోలో రైలు నిలిచి ఉన్నప్పటికీ.. పట్టాలపైకి వెళ్లడం రైలు సమీపంలో స్టంట్స్ చేయడం ప్రమాదకరమని నెటిజన్లు గుర్తుచేస్తున్నారు. అయితే ఈ వీడియో ఎప్పుడు, ఎక్కడ చిత్రీకరించారనే విషయం తెలియలేదు ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో కొత్తేమీ కాదు. రైల్వే ప్లాట్‌ఫామ్‌లు, రైలు బోగీలు, పట్టాల సమీపంలో డ్యాన్స్‌లు, రీల్స్, ప్రమాదకర స్టంట్స్ చేస్తూ వీడియోలు తీసిన సందర్భాలు గతంలోనూ చూశాం. రైల్వే అధికారులు పలుమార్లు ప్రయాణికులు, ప్రజలను హెచ్చరించినా రీల్స్ మోజులో పడి జనం నిబంధనలను పక్కన పెడుతున్నారు. రైల్వే ట్రాక్‌లపైకి అనుమతి లేకుండా వెళ్లడం, రైళ్ల సమీపంలో ప్రమాదకర చర్యలకు పాల్పడటం ప్రాణాలకు ముప్పు కలిగించడమే కాకుండా ఇతరుల భద్రతకు కూడా ప్రమాదంగా మారవచ్చు. సోషల్ మీడియాలో వైరల్ కావాలనే ప్రయత్నంలో.. ఒక చిన్న తప్పిదం జీవితాంతం మిగిల్చే ప్రమాదాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందని పలువురు నెటిజన్లు సూచిస్తున్నారు.

 

Loading...
Unable to load recommendations.
Follow Us