Watch Video: ఏం ధైర్యం సామి! శరీరాన్ని చుట్టేసుకున్న కోడె నాగు.. వీడియో చూసి నెటిజన్లు షాక్!

పాము పేరు వినగానే చాలా మంది భయంతో వణికిపోతారు. అలాంటిది ఓ భారీ పామును ఓ మహిళ ఎంతో ధైర్యంగా, ప్రశాంతంగా రక్షించింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆమె చూపిన సాహసం, సమయస్ఫూర్తి నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

Watch Video: ఏం ధైర్యం సామి! శరీరాన్ని చుట్టేసుకున్న కోడె నాగు.. వీడియో చూసి నెటిజన్లు షాక్!
Woman Rescued Cobra

Updated on: Jun 13, 2026 | 6:04 PM

పాము పేరు వినగానే చాలా మంది భయంతో వణికిపోతారు. అలాంటిది ఓ భారీ పామును ఓ మహిళ ఎంతో ధైర్యంగా, ప్రశాంతంగా రక్షించింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆమె చూపిన సాహసం, సమయస్ఫూర్తి నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

వైరల్ అవుతున్న వీడియోలో ఓ నివాస ప్రాంతంలో పొడవాటి పాము కనిపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. పాము పరిమాణం చూసి చాలామంది దానిని నాగుపాముగా భావించి సురక్షిత దూరంలో నిలబడ్డారు. ఎవరూ దగ్గరకు వెళ్లేందుకు సాహసం చేయలేదు. అలాంటి సమయంలో ఓ మహిళ ముందుకొచ్చి పరిస్థితిని తన చేతుల్లోకి తీసుకుంది.

ఎలాంటి భయం లేకుండా పాము వద్దకు వెళ్లిన ఆమె, ఎంతో జాగ్రత్తగా దానిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో పాము చురుకుగా కదులుతూ ఆమె శరీరం చుట్టూ చుట్టుకునే ప్రయత్నం చేసినా, ఆమె ఏమాత్రం ఆందోళన చెందకుండా అప్రమత్తంగా వ్యవహరించింది. ఆమె ఆత్మవిశ్వాసం, అనుభవం వీడియోలో స్పష్టంగా కనిపిస్తున్నాయి.

ఇక చుట్టుపక్కల ఉన్నవారు మాత్రం దూరం నుంచే ఈ దృశ్యాన్ని గమనిస్తూ కనిపించారు. కొందరు తమ మొబైల్ ఫోన్లలో ఈ ఘటనను చిత్రీకరించారు. దీంతో వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అయింది. లక్షలాది మంది ఈ వీడియోను వీక్షిస్తూ మహిళ ధైర్యసాహసాలను ప్రశంసిస్తున్నారు. కొన్ని నిమిషాల పాటు సాగిన రెస్క్యూ ఆపరేషన్ అనంతరం ఆ మహిళ పామును విజయవంతంగా అదుపులోకి తీసుకుంది. అనంతరం దానిని ప్రత్యేక కంటైనర్‌లో భద్రంగా బంధించి, సురక్షిత ప్రదేశానికి తరలించే ఏర్పాట్లు చేసింది.

ఈ వీడియో చూసిన నెటిజన్లు “ఇది నిజమైన ధైర్యం”, “ఆమెకు సెల్యూట్”, “పామును చంపకుండా కాపాడడం గొప్ప విషయం” అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రమాదకర పరిస్థితుల్లో కూడా ధైర్యం, అనుభవం ఉంటే ఎంతటి సవాళ్లనైనా ఎదుర్కోవచ్చని ఈ మహిళ మరోసారి నిరూపించింది.

షాకింగ్ వీడియో ఇక్కడ చూడండి..

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…

Follow Us