
రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు వాహనదారుల మధ్య వాగ్వాదాలు జరగడం సాధారణమే. అయితే కొన్నిసార్లు చిన్నపాటి వివాదాలు తీవ్ర ఘర్షణలకు దారితీస్తుంటాయి. ఇలాంటి ఘటనే ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. స్కూటర్ ఢీకొన్న ఘటన తర్వాత ఓ మహిళ నడిరోడ్డుపై యువకుడిపై దాడికి దిగిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. యువకుడిని పదేపదే కొడుతూ, జుట్టు పట్టుకుని లాగుతున్న దృశ్యాలు నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.
స్కూటర్ ప్రమాదంతో మొదలైన వివాదం!
ఓ స్కూటర్ ప్రమాదం తర్వాత మహిళకు, యువకుడికి మధ్య వివాదం మొదలైంది. ఈ ఘటనలో ఇద్దరి తప్పు ఉన్నప్పటికీ మహిళ మాత్రం యువకుడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ దాడికి దిగినట్లు వీడియో క్యాప్షన్‌లో పేర్కొన్నారు. అయితే అసలు ప్రమాదం ఎలా జరిగింది? ఎవరి తప్పు ఎంత ఉంది? అనే విషయాలు మాత్రం వీడియోలో స్పష్టంగా తెలియడం లేదు.
నడిరోడ్డుపై జుట్టు పట్టుకుని దాడి!
వైరల్ వీడియోలో రోడ్డుపై ఓ స్కూటర్ పార్క్ చేసి ఉండగా, నలుపు, తెలుపు రంగుల చారల టీషర్ట్ ధరించిన యువకుడు దాని పక్కన నిలబడి కనిపించాడు. ఇంతలో అక్కడికి వచ్చిన ఓ మహిళ అతడితో వాగ్వాదానికి దిగింది. మాటామాటా పెరగడంతో ఒక్కసారిగా యువకుడిని తోస్తూ కొట్టడం ప్రారంభించింది. అంతటితో ఆగకుండా పలుమార్లు అతడి దగ్గరకు వెళ్లి పదేపదే దాడి చేసింది. అతడి జుట్టు పట్టుకుని లాగుతూ కొట్టడం కూడా వీడియోలో కనిపిస్తోంది. మరో వ్యక్తి ఈ ఘర్షణలో జోక్యం చేసుకుంటూ యువకుడిని నెట్టినట్లు కనిపిస్తోంది.
నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు!
ఈ ఘటనను చూసేందుకు పెద్ద సంఖ్యలో జనం అక్కడ గుమిగూడారు. కొందరు గొడవను ఆపేందుకు ప్రయత్నించారు. వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. “తిరిగి దాడి చేయకుండా సంయమనం పాటించిన యువకుడికి అభినందనలు” అంటూ ఒకరు కామెంట్ చేయగా, “ఒక పురుషుడిపై ఈ విధంగా దాడి చేసే హక్కు మహిళకు ఉందా?” అంటూ మరొకరు ప్రశ్నించారు. మొత్తానికి రోడ్డు ప్రమాదం పేరుతో మొదలైన ఈ వివాదం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఏదేమైనా, తప్పు ఎవరిదైనా సరే.. సమస్యలను దాడులు, హింసతో పరిష్కరించుకోవడం సరికాదని పలువురు అభిప్రాయపడుతున్నారు.
వైరల్ వీడియోను ఇక్కడ చూడండి..
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..