అమెరికాలో మేయర్‌గా ఎన్నికైన మేక.. కుక్క మీద ఘన విజయం

| Edited By:

Mar 09, 2019 | 9:27 PM

అమెరికాలో వింతలు, విచిత్రాలకు కొదవ ఉండదు. అక్కడ టీనేజర్లను సైతం మేయర్లుగా ఎన్నుకుంటూ ఉంటారు. తాజాగా మసాచుసెట్స్ లోని ఫెయిర్ హెవెన్ టౌన్ లో మరో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఈ నగరానికి మేయర్ గా మూడేళ్ల వయసున్న లింకన్ అనే బుజ్జి మేక ఎన్నికయింది. ఫెయిర్ హెవెన్ అనే చిన్న టౌన్‌లో ప్లేగ్రౌండ్ నిర్మాణం కోసం నిధులు సమీకరించాలని నిర్ణయించారు. అందుకోసం ప్రజల నుంచి డబ్బులు వసూలు చేయాలనుకున్నారు. ప్రజల నుంచి మామూలుగా అడిగితే డబ్బులు […]

అమెరికాలో మేయర్‌గా ఎన్నికైన మేక.. కుక్క మీద ఘన విజయం
Follow us on

అమెరికాలో వింతలు, విచిత్రాలకు కొదవ ఉండదు. అక్కడ టీనేజర్లను సైతం మేయర్లుగా ఎన్నుకుంటూ ఉంటారు. తాజాగా మసాచుసెట్స్ లోని ఫెయిర్ హెవెన్ టౌన్ లో మరో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఈ నగరానికి మేయర్ గా మూడేళ్ల వయసున్న లింకన్ అనే బుజ్జి మేక ఎన్నికయింది. ఫెయిర్ హెవెన్ అనే చిన్న టౌన్‌లో ప్లేగ్రౌండ్ నిర్మాణం కోసం నిధులు సమీకరించాలని నిర్ణయించారు. అందుకోసం ప్రజల నుంచి డబ్బులు వసూలు చేయాలనుకున్నారు. ప్రజల నుంచి మామూలుగా అడిగితే డబ్బులు రావు కాబట్టి, ఓ ఎన్నిక నిర్వహించారు. అందులో కుక్కలు, పిల్లలు, మేకలు ఇలాంటివన్నీ పోటీ చేయవచ్చు. అయితే, అందులో పోటీ చేసే జంతువుల యజమానులు ఒక్కొక్కరు ఐదు డాలర్లు కట్టాలి. ఈ క్రమంలో స్థానిక స్కూల్ టీచర్‌కి చెందిన మేక కూడా బరిలో దిగింది. కొందరు తమ కుక్కలు, పిల్లులను కూడా పోటీలో నిలిపారు. చివరకు 13 ఓట్లతో మేక గెలిచింది. దీంతో మేక మేయర్‌గా ఎన్నికైనట్టు ప్రకటించారు.