తొలిరాత్రే షాక్ ఇచ్చిన భార్య.. విడాకుల కోసం రెండేళ్లు తిరిగి రూ. 10 లక్షలు ఖర్చు చేసిన భర్త!

భారతీయ సమాజంలో అరేంజ్డ్ మ్యారేజ్ పై ఎన్నో నమ్మకాలు, అంచనాలు ఉంటాయి. అయితే పెళ్లయిన మొదటి రోజే ఆ కలలన్నీ కరిగిపోతే ఆ భర్త వేదన ఎలా ఉంటుందో ఊహించడం కష్టం. తాజాగా సోషల్ మీడియా ఎక్స్ లో వైరల్ అవుతున్న ఒక నిజ జీవిత ఉదంతం నెటిజన్లను తీవ్రంగా ఆలోచింపజేస్తోంది. 8 నెలల పరిచయం తర్వాత పెళ్లి చేసుకున్న ఒక వ్యక్తికి తొలిరాత్రే తీవ్రమైన చేదు అనుభవం ఎదురైంది. ఆ షాక్‌తో అతడు విడాకుల కోసం ఉన్నదంతా ఊడ్చిపెట్టాల్సి వచ్చింది.. పూర్తి వివరాల్లోకి వెళితే..

తొలిరాత్రే షాక్ ఇచ్చిన భార్య.. విడాకుల కోసం రెండేళ్లు తిరిగి రూ. 10 లక్షలు ఖర్చు చేసిన భర్త!
Divorce After Wedding Night
Image Credit source: AI image

Updated on: Aug 19, 2026 | 5:43 PM

అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్న ఓ వ్యక్తికి శోభనం రోజే ఊహించని షాక్ తగిలింది. పెళ్లయిన మొదటి రాత్రే భార్య చెప్పిన షాకింగ్‌ నిజంతో ఆ ఇద్దరి మధ్య బంధం ముగిసి విడాకుల వరకు వెళ్లింది. విడాకులు పొందడానికి బాధితుడికి రెండేళ్ల సుదీర్ఘ సమయం పట్టడమే కాకుండా, భరణం, కోర్టు ఖర్చుల కోసం ఏకంగా రూ. 10 లక్షలు ఖర్చు చేయాల్సి వచ్చింది. ఎక్స్ లో వైరల్ అవుతున్న ఈ ఘటనపై నెటిజన్లు పురుషుల హక్కులు, వివాహ చట్టాలపై తీవ్రంగా చర్చిస్తున్నారు. అసలేం జరిగింది..?

బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. పెళ్లికి ముందే వీరికి పరిచయం ఏర్పడింది.. దాదాపు 8 నెలల పాటు ఇద్దరూ మాట్లాడుకున్నారు. ఈ సమయంలో వీరి సంబంధం చాలా బాగుంది. అయితే పెళ్లికి ముందు శారీరక బంధం వద్దని యువతి కోరగా, భర్త ఆమె నిర్ణయాన్ని పూర్తిగా గౌరవించాడు. కానీ, పెళ్లయి శోభనం గదిలోకి అడుగుపెట్టిన వెంటనే భార్య ఊహించని బాంబు పేల్చింది. తనకు ఈ పెళ్లి ఎంతమాత్రం ఇష్టం లేదని, కేవలం తల్లిదండ్రుల ఒత్తిడి వల్లే చేసుకున్నానని చెప్పేసింది. తానేమైనా చేసుకుంటానని ఇంట్లోవాళ్లు బెదిరించడంతోనే ఒప్పుకోవాల్సి వచ్చిందని భర్తకు తెలిపింది. కావాలంటే తనను బలవంతం చేయవచ్చని కూడా ఆమె అనడంతో, శారీరకంగా కలవడానికి నిరాకరించిన భర్త వెనక్కి తగ్గాడు.

ఇవి కూడా చదవండి

ఆ తర్వాత ఇద్దరూ విడిపోవాలని నిర్ణయించుకున్నారు. అయితే చట్టబద్ధంగా విడాకులు పొందడం అతనికి ఏమాత్రం సులభం కాలేదు. ఈ కేసు తేలడానికి ఏకంగా 2 సంవత్సరాల సుదీర్ఘ సమయం పట్టింది. అంతేకాకుండా, కోర్టు ఖర్చులు, భరణం కింద సదరు వ్యక్తి రూ. 10 లక్షలు చెల్లించాల్సి వచ్చింది. కాగా, ఈ వార్త ఇంటర్‌నెట్‌లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

@fintech_shark అనే ఎక్స్ ఖాతా ద్వారా వెలుగులోకి వచ్చిన ఈ ఉదంతంపై ఇంటర్నెట్‌లో తీవ్ర స్థాయిలో చర్చ నడుస్తోంది. ఎలాంటి తప్పు చేయకపోయినా, శారీరక బంధం కూడా ఏర్పడకపోయినా భర్త రెండేళ్ల సమయాన్ని, రూ. 10 లక్షల డబ్బును నష్టపోవడంపై నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు శారీరక సంబంధమే లేనప్పుడు విడాకుల కంటే వివాహ రద్దు కోరాల్సిందని కొందరు అభిప్రాయపడగా, భారతీయ వివాహ చట్టాలు పురుషుల పట్ల నిష్పాక్షికంగా లేవని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us