Viral Video: మొసలి నవ్వింది.. మనసు దోచుకుంది.. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న వీడియో

|

May 23, 2022 | 9:01 PM

Viral Video: అప్పుడప్పుడు కొన్ని వీడియోలు ఫన్నిగా ఉంటాయి. కొన్ని ఆశ్చర్యపోయేలా ఉంటాయి. ఏదైనా వైరల్ కావాలంటే అది సోషల్ మీడియానే అని చెప్పక తప్పదు. సాధారణంగా ..

Viral Video: మొసలి నవ్వింది.. మనసు దోచుకుంది.. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న వీడియో
Follow us on

Viral Video: అప్పుడప్పుడు కొన్ని వీడియోలు ఫన్నిగా ఉంటాయి. కొన్ని ఆశ్చర్యపోయేలా ఉంటాయి. ఏదైనా వైరల్ కావాలంటే అది సోషల్ మీడియానే అని చెప్పక తప్పదు. సాధారణంగా జంతువులకు సంబంధించిన వీడియో (Video)లు ఎక్కువగా వైరల్ అవుతుంటాయి. పులులు,సింహాలు, మొసళ్లు, పాములకు సంబంధించిన వీడియోలు ట్రెండింగ్ లో ఉంటాయి.ఇక తాజాగా ఓ మొసలి వీడియో సోషల్ మీడియా (Social Media)లో తెగ వైరల్ అవుతోంది. ఓ మొసలి నవ్వుతున్న వీడియో వైరల్ గా మారింది. మొస‌లి న‌వ్వ‌డ‌మేంట‌ని ఆశ్చ‌ర్య‌పోతున్నారా? అవును ఇది నిజమే. ఓ అక్వేరియంలో కేర్‌టేక‌ర్ తెల్ల‌ని మొస‌లి (ఆల్బినో అలిగేట‌ర్‌) వీపు రుద్దుతుండ‌గా సంతోష‌క‌ర‌మైన ఎక్స్‌ప్రెష‌న్ ఇచ్చింది. ఈ వీడియో నెటిజ‌న్ల మ‌న‌సు దోచుకుంది.

 

ఇవి కూడా చదవండి


ఈ వీడియోను ‘గేట‌ర్స్ డెయిలీ’ అనే యూజ‌ర్ ట్విట‌ర్‌లో షేర్ చేశారు. అమెరికాలోని నార్త్ క‌రోలినా అక్వేరియంలో లూనా అనే అల్బినో అలిగేట‌ర్ ఉంది. వాటిని కేర్‌టేక‌ర్స్ ప్ర‌తిరోజూ క్లీన్ చేస్తుంటారు. ఇందులోభాగంగా కేర్‌టేక‌ర్ స్క్ర‌బ్‌తో మొస‌లి వీపుపై రుద్దింది. ఆ క్ష‌ణంలో మొస‌లి న‌వ్వుతూ క‌నిపించింది. ఈ వీడియో ఆన్‌లైన్‌లో చ‌క్క‌ర్లు కొడుతున్న‌ది. ఇప్ప‌టివ‌ర‌కూ 2.7ల‌క్ష‌ల మంది వీక్షించారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి